Home / ప్రాంతీయం
టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది. ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
TSPSC Group 2: రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్- 2 పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆగస్టు చివర్లో.. అనగా 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి.. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చిని అధికారులు తెలిపారు.
Bandi Sanjay: దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో బండి సంజయ్, తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాజపా భవిష్యత్ కార్యాచరణ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించారు.
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
GHMC: సంచలనం రేపిన వీధి కుక్కల దాడి ఘటనలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ నష్టపరిహారం అందించనుంది. మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ నుంచి రూ.8లక్షలు కాగా.. కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షల ఆర్ధిక సాయన్ని అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రీతి మృతి చెందిన తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.
Ap Cm Jagan: రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.
గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే ఆర్ఎస్ఎస్ మార్చ్ లో పాల్గొనాలని హైకోర్టు ఆదేశం. మసీదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గానే వాళ్లు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని తెలిపింది.
Drunken Drive: కారును ఆపిన పోలీసులకు "నెల్లూరి పెద్దారెడ్డి" పేరు చెబుతూ బిల్డప్ బాబాయ్‌గా బ్రహ్మానందం ఓ సినిమాలో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఇవాళ్టికీ ఆ బిల్డప్ కామెడీ.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటోంది. సరిగ్గా అదే తరహాలో ఈ ఘటన జరిగింది.