Last Updated:

RSS March: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయి

గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే ఆర్ఎస్ఎస్ మార్చ్ లో పాల్గొనాలని హైకోర్టు ఆదేశం. మసీదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గానే వాళ్లు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని తెలిపింది.

RSS March: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయి

RSS March: భైంసాలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే మార్చ్ కు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మార్చ్ కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మార్చ్ ను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా నిర్మల్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు

అదే విధంగా 500 మంది మాత్రమే ర్యాలీ నిర్వహించాలని వెల్లడించింది. మసీదుకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే మార్చ్ లో పాల్గొనాలని ఆదేశించింది. మసీదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గానే వాళ్లు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని తెలిపింది.

 

ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే నిరాకరణ(RSS March)

మార్చి 5 న భైంసాలో ఆర్ఎస్ఎస్ భారీ ర్యాలీ తలపెట్టింది. అందుకోసం జిల్లా పోలీసులను అనుమతి కోరగా.. శాంతి భద్రతల దృష్ట్యా వారు అనుమతి నిరాకరించారు.

అయితే, అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

మార్చి 5 న ర్యాలీకి అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ర్యాలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరో వైపు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతి ఇవ్వలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు సమర్పించారు.

రెండేళ్ల క్రితం భైంసాలో మత ఘర్షణలు జరిగాయని.. ఆ ఘర్షణల్లో ప్రాణ నష్టం కూడా జరిగిందని వివరించారు.

భైంసా అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతమని న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు బలంగా వినిపించారు.

విద్వేషపూరితంగా ఒక్క వ్యాఖ్య చేసినా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఛాన్స్ ఉందని, అనుమతి ఇస్తే అల్లర్లు జరిగే అవకాశముందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు.

అయితే టిప్పు సుల్తాన్ పుట్టిన రోజున ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారన్న పిటిషనర్ తరపు న్యాయవాది.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇవ్వకడానికి అభ్యంతరం ఏంటన్నారు.

భైంసా ఇండియాలోనే ఉందని.. భారత్ వెలుపల లేదని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు భైంసా లో ఆర్ఎస్ఎస్(RSS)ర్యాలీ కి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.