Home / ప్రాంతీయం
Vijayawada Education News : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో అపార అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ, విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజీతో కీలక పరస్పర అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ)పై సంతకం చేసినట్లు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ఎన్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సంధర్భంగా స్టెల్లా కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మేరీస్ స్టెల్లా కళాశాలతో ఈ […]
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
Naveen Murder: పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సంఘటన స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. సాయంత్రం మరోసారి బయటకు తీసుకువెళ్లారు. మలక్‌పేటలోని సలీంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లారు.
Chandrababu Naidu: యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగబోదని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
AP GIS 2023: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. గడిచిన మూడెళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని అన్నారు.
జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో భాగంగా ఈరోజు విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగం ఇచ్చారు. ఈ మేరకు జగన్ మాట్లాడుతూ..
ప్రమాద సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ప్రస్తుత కాలంలో సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల ముసుగులో మనుషులు సిగ్గుమాలిన చర్యలకు దిగజరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తనో.. భార్యనో.. ప్రియుడినో.. మిగతా వారు హతమార్చడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబదులే ధ్యేయంగా విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్నాథ్... సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు.
GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు.