Harish Rao: బ్రిటన్ నుంచి వచ్చి.. చిన్నారులకు ప్రాణం పోసిన డాక్టర్లు
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
Harish Rao:హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో 9 మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఆహ్వానం మేరకు.. డాక్టర్ రమణ యూకే నుంచి వచ్చి చిన్నారులకు గుండె సర్జీరీలను విజయంతంగా పూర్తి చేశారు. అనంతరం చిన్నారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు.
బ్రిటన్ నుంచి వచ్చి.. చిన్నారులకు ప్రాణం పోసి (Harish Rao)
నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు. నిమ్స్ లో వైద్యులను సన్మానించిన అనంతరం.. ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలనలో గాంధీ, నిమ్స్, ఉస్మానియా మినహా ఓ ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించలేదని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తూనే.. ఉన్నవాటిని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుందని వివరించారు. నిమ్స్ ఆస్పత్రిలో చిన్న పిల్లల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేసిన యూకే వైద్య బృందాన్ని సన్మానించారు. చిన్నారుల శస్త్ర చికిత్స అందించలేక నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమ చిన్నారులను కోల్పోతున్నారన్నారు. దిల్లీలోని ఎయిమ్స్ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్‌లోనే తొలిసారి గుండెశస్త్ర చికిత్సలు జరిగాయన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగిన గుండె శస్త్ర చికిత్సల వైద్య శిబిరంలో 9 మంది పసి పిల్లలకు ప్రాణం పోసిన వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. 3 నెలల చిన్నారికి చేసిన సర్జరీ విజయవంతమైందని వెల్లడించారు.
వైద్యులకు మంత్రి పిలుపు..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన వైద్యులు సొంతగడ్డపై సేవలు అందించేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ రమణ నేతృత్వంలో 10 వైద్యులు, నర్సుల బృందం చేసిన సేవలను ఆయన కొనియాడారు. డాక్టర్ రమణను స్ఫూర్తిగా తీసుకుని ఇతర దేశాల్లో స్థిరపడిన వైద్యులు రాష్ట్రంలో సేవలు అందించడానికి ముందుకు రావాలని కోరారు. వైద్య రంగంలో నూతన విజ్ఞానం, సాంకేతికత అందించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో నాలుగువైపుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి అన్నారు. వరంగల్‌లో 2వేల పడకలతో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీని ఈ ఏడాది దసరా పండగ వరకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.