Ap Global Investors Summit : రెండవ రోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023.. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబదులే ధ్యేయంగా విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్... సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు.
Ap Global Investors Summit : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబదులే ధ్యేయంగా విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్… సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని అన్నారు. ఇప్పుడు వస్తున్న వన్నీ రియలిస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని చెప్పారు. మూడేళ్లలో 89 శాతం ఎంవోయూలు వాస్తరూపంలోకి వస్తాయన్నారు. కాగా మొదటి రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 348 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వాటి విలువ రూ.13 లక్షల కోట్లు అని సీఎం జగన్ అన్నారు. దీనివల్ల 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు.
రెండో రోజు ఇప్పటి వరకు జరిగిన ఎంవోయూలు (Ap Global Investors Summit)..
ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు
బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు
ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు
గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు
ఎక్స్‌ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు
రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు
క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు
ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు
ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు
తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు
కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు
అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు
దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు
అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు
డీఎక్స్‌ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు
ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు
నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు
అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు
కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు
నార్త్ ఈస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు
ఆటమ్‌స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు
క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు
చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు
వీఆర్‌ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు
రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు
హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు
సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు
పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు
ఇండియా అసిస్ట్ ఇన్‌సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు
స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు
టెక్ విషెన్ సాఫ్ట్‌వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు
మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు
నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు
ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు
అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు
సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు
హ్యాపీ వండర్‌లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు
చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు
టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు
పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు
ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు
ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు
హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు
గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు
(Ap Global Investors Summit) హాజరుకానున్న కేంద్రమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు..
కాగా నేటి సదస్సులో కిషన్ రెడ్డి, సర్బానందసోనోవాలా, రాజీవ్ చంద్ర శేఖరన్ తదితర కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అలాగే రెడ్డీస్ లాబోరేటరీ చైర్మన్ సతీష్ రెడ్డి, నోవా ఎయిర్ సీఈఓగజానన నాబర్, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ లాబ్స్ చైర్మన్ సత్యనారాయణ చావా, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీకృష్ణ బండీ, గ్రీన్ కో డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి, సెయింట్ గోబైన్ సీఈఓ సంతానం, అపాచి హిల్ టాప్ హెడ్ సెరిగో లీ, బ్లెండ్ హబ్ వ్యవస్థాపకుడు హెన్ రిక్ స్టామ్ , వీస్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మందావే వాలా, భారత్ బయోటెక్ చైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా తదితర పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
అదే విధంగా పలువురు వ్యాపారవేత్తలు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కీలక ఉపన్యాసం ఉంటుంది. అనంతరం సమ్మిట్ వేదికపై నుంచి కొత్త పరిశ్రమ యూనిట్ల ప్రారంభోత్సవం చేస్తారు. ఇక మధ్యాహ్నం 12.45 నుంచి 1.05 వరకు ముఖ్యమంత్రి జగన్ ముగింపు ఉపన్యాసం ఇవ్వనున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/