Home / ప్రాంతీయం
Siddipet: వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. చాలా మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కొందరు హత్యలకు పాల్పడితే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. దెబ్బ మీద దెబ్బ.. తగులుతూనే ఉంది. ఒక దెబ్బ నుంచి కొలుకునే లోపే మరోదెబ్బ కోలుకోకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఒకింత అయోమయానికి గురవుతుండగా.. సీఎం జగన్ తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి..
దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఫోన్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 16.8 కోట్ల మంది డేటాను సేకరించి విక్రయించినట్లు విచారణలో గుర్తించారు.
:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ విచారణకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వలపై పార్లమెంట్ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వచేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
విశాఖపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో గల రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరో ఆరుగురిని
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైకాపా అధినేత, సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.