Home / ప్రాంతీయం
బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సింధు ఫౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి వ్యవహరిస్తున్నారు.
9th Nizam Nawab: నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 57వ వర్ధంతి సందర్బంగా నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తూనే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ వివరించారు.
తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో వారంరోజులపాటు ధాన్యం కొనుగోళ్లను కొనసాగించాలని భావిస్తోంది. జూన్ 10 నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేసి ఈ సీజన్ ను ముగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జనవరి 18న ఖమ్మంలో ప్రారంభించిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.6 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు.
Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో ఆయన మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ ప్రకటించింది. కటకం సుదర్శన్ అలియాస్ కామ్రేడ్ ఆనంద్ 69 సంవత్సరాల క్రితం ఒక కూలీ కుటుంబంలో జన్మించాడు
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులకు వరుసగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది.
కన్నకుమార్తెను సినీ రంగంలోకి పంపించాలనే మోజుతో ఓ తల్లి చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ చేయాలనే ఆశతో.. చిన్నారిని త్వరగా పెద్ద దాన్ని చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి యాత్ర మొదలు పెట్టనున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వారాహి వాహనంలో ఆయన పర్యటన చేయనున్నారు. అన్నవరంలో పూజ చేసిన తర్వాత పవన్ యాత్ర ప్రారంభమవుతుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు