Last Updated:

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో లెక్కకురాని, జాడలేని తెలుగువారు.. 100 మందికిపైగా మిస్సింగ్

Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో లెక్కకురాని, జాడలేని తెలుగువారు.. 100 మందికిపైగా మిస్సింగ్

Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు. 1175 మందికి పైగా గాయపడినట్టు తెలిపారు. వారిలో 793 మంది గాయాల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వివరించారు. కాగా ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స అందుతోంది. అయితే, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.. వారికి ఇంకా చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

వారి జాడలేదే..(Odisha Train Accidet)

మరోవైపు ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. ఈ తరుణంలో రైలు ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికుల లెక్కపై కాస్త గందరగోళం నెలకొంది. అసలు ఆ రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న తెలుగువాళ్లు ఎంతమంది?.. ఎందమంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతమంది గాయపడ్డారు.. ఎంతమంది ఈ ప్రమాదం నుంచి బయటపడి ఇళ్లకు చేరుకున్నారు.. ఇంకెంత మంది ఆచూకీ లభించలేదు?.. అనే విషయాలపై ఇప్పటికీ లెక్కలు తేలలేదు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482మంది తెలుగువాళ్లు ఎక్కినట్టు ఆధారాలు దొరికాయ్‌. కాగా వారిలో 267మంది ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డారు. కాగా మిగిలిన 113మంది ఆచూకీ ఏమైపోయినట్టు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదిలా ఉంటే రిజర్వేషన్ లేకుండా జనరల్‌ బోగీల్లో ఎక్కిన తెలుగువాళ్లు ఎంతమంది?.. అనేది మాత్రం లెక్క తేలడం లేదు. పోనీ వారి ఫోన్లు ద్వారా ట్రాక్ చేద్దామా అని చూసినకూడా మిస్సైన ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో బంధువుల్లో మరింత టెన్షన్‌ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 89మంది తెలుగువాళ్లు ప్రయాణిస్తే.. అందులో 49మంది సేఫ్ గా ఉన్నట్టు తేలింది. ఇంకా 28మంది ఆచూకీపై లభించలేదు. జనరల్‌ బోగీల్లో మరో 50మంది వరకు తెలుగు ప్రయాణికులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.