Last Updated:

HCU: హైటెన్షన్.. హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్

HCU: హైటెన్షన్.. హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్

High Tension At HCU Campus Lathi Charge: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ గేటు లోపల ఉంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నిరసన చేపడుతున్నారు. 400 ఎకరాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

 

ఈ సమయంలోనే విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు ఈస్ట్ క్యాంపస్ వైపు ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొని విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. అయితే రెండు రోజులుగా 40కిపైగా జేసీబీలు ఆ ప్రాంతంలో చదును చేస్తున్నాయి. ఈ మేరకు జేసీబీలను తొలగించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: