Inner Ring Road Case.ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ నెల 29వ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అలైన్ మెంట్ మార్పు..(Inner Ring Road Case)
జనవరి 10న, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఎక్సైజ్ పాలసీ కేసు, ఇసుక మైనింగ్ కేసు అనే మూడు కేసులలో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాజధాని నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించినది.2014 నుంచి 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు, మరికొందరు ప్రభుత్వ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టానుసారం మార్చారన్న ఆరోపణలు వచ్చాయి. కొంతమంది వ్యక్తులు, సంస్దలకు ఉద్దేశ పూర్వకంగా లబ్దిని కలిగించడానికే ఇలా చేసారని పేర్కొన్నారు. ఈ కేసులో ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ, ఏ-3 లింగమనేని రమేష్, ఏ-4 లింగమనేని వెంకట సూర్యరాజవేఖర్, ఏ-5 గా కేపీవీ అంజని కుమార్, ఏ-6 గా హెరిటేజహ ఫుడ్స్, ఏ-7 ఎల్పీఈఎల్ ప్రాజెక్ట్స్, ఏ-14గా లోకేశ్ ఉన్నారు.