Data leak case: డేటా లీక్ కేసులో కీలక మలుపు.. నిందితుడు భరధ్వాజ్ అరెస్ట్
భారత దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసులో నిందితుడు భరద్వాజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాలకి చెందిన 8 మెట్రోపాలిటన్ సిటీలకి చెందిన డేటా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని భరద్వాజ్ ముఠా విక్రయించినట్లు గుర్తించారు.
Data leak case:భారత దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసులో నిందితుడు భరద్వాజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాలకి చెందిన 8 మెట్రోపాలిటన్ సిటీలకి చెందిన డేటా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని భరద్వాజ్ ముఠా విక్రయించినట్లు గుర్తించారు. 9,10,11,12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ అయినట్లు తేలింది. బైజూస్, డిమ్యాట్, బుక్ మై షో, అమెజాన్, వేదాంత తదితర 104సంస్థలకి చెందిన డేటాని అమ్మేసినట్లు నిర్థారించారు. వివిధ రాష్ట్రాల్లో భరద్వాజ్ 4.5 లక్షల మంది ఉద్యోగులని నియమించుకుని ఈ చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు తేల్చారు.
అత్యధికంగా మహారాష్ట్ర డేటా చోరీ.. (Data leak case)
ఈ ముఠా అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన డేటాను చోరీ చేసినట్లు తేలింది. మహారాష్ట్ర నుంచి 4 కోట్ల మంది డేటా, ఆంధ్రప్రదేశ్ నుంచి 2.5 కోట్ల మంది డేటా, తెలంగాణ లోని హైదరాబాద్ నుంచి కోటి మంది డేటాను ఈ ముఠా తస్కరించింది.బుక్ మై షో, ఇన్స్టాగ్రామ్, జోమాటో, పాలసీ బజార్ల నుంచి కూడా డేటా చోరీ జరిగింది.సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్‌ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. ఇటువంటి మెసేజ్‌లపై ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.ఈ ముఠా కొన్ని కోట్ల మంది డేటాను చోరీ చేసింది. ఇన్సూరెన్స్ లోన్ కోసం అప్లై చేసిన నాలుగు లక్షల మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేసింది. 7 లక్షల మంది ఫేస్బుక్ యూజర్స్ డేటాను దొంగలించింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్ల ఐడీ, పాస్వర్డ్లు కూడా లీక్ అయ్యాయి. ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారు.
డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటాను సైతం ఈ ముఠా చోరీ చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టారు. డేటా మెుత్తాన్ని సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. నిందితులు ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కోసం ఒక ఏజెన్సీని పెట్టుకున్నారు. ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటాను అమ్ముకున్నాడు. చోరికి గురైన వ్యక్తిగత డేటాను రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. డేటా చోరీ కేసు సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఐపీఎస్ అధికారితో సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.