Last Updated:

KF Beer: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు

KF Beer: ప్రజా సమస్యలను వినడానికే ప్రజావాణి ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వివరించుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి కూడా.. తన సమస్యను ప్రజావాణిలో కలెక్టర్ కు విన్నవించుకున్నాడు. కానీ ఈ సమస్య వింటే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.

KF Beer: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు

KF Beer: తెలంగాణ ప్రజలకు తాగడం వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం అని నాని సినిమాలో ఓ డైలాగ్ ఇది. అవును మనవాళ్లు.. తాగే విషయంలో.. బ్రాండ్ ల విషయంలో ఏ మాత్రం రాజీపడరు. ఈ విషయం మరోసారి రుజువైంది. తమకు నచ్చిన బీర్ అమ్మడం లేదని ఓ వ్యక్తి ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వ్యక్తి.. (KF Beer)

ప్రజా సమస్యలను వినడానికే ప్రజావాణి ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వివరించుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి కూడా.. తన సమస్యను ప్రజావాణిలో కలెక్టర్ కు విన్నవించుకున్నాడు. కానీ ఈ సమస్య వింటే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. తనకు నచ్చిన మద్యం బ్రాండ్ అమ్మడం లేదని ఈ ఫిర్యాదు సారంశం. తమకు ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే ఎందుకు సర్ధుకుపోవాలి అనుకున్నాడో ఏమో. దీనిపై ఏకంగా కలెక్టర్ నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్‌ ఫిషర్‌ బీర్లు అందుబాటులో లేవు’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీని ప్రభుత్వమే చూస్తుంది కాబట్టి.. ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు.

కింగ్ ఫిషర్ బీర్ కోసం ఫిర్యాదు..

జగిత్యాల జిల్లాకు చెందిన బీరం రాజేష్‌ ఎక్కువగా కింగ్ ఫిషర్ బీర్లను తాగేవాడు. ఈ మధ్య అవి మందుషాపుల్లో దొరకడం లేదు. ఇక తమ ఊరిలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు. దీనినే ఒక సమస్యగా భావించి.. ఫిర్యాదు చేశాడు. తనకు వచ్చిన సమస్య కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ అందుబాటులో లేదనేది. దీన్ని ఏకంగా కలెక్టర్‌ వద్దకే తీసుకెళ్లాడు. ప్రజావాణిలో తమకు కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ బీర్లు దొరకడం లేదని విన్నవించాడు. ఇది చూడటానికి నవ్వు తెప్పించినా మనోడి కష్టం ఎవరికి తెలుసు. మరి ఆ కలెక్టర్‌గారు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారా.. లేక లైట్‌ తీసుకుంటారో వేచి చూడాలి.

గతంలో కూడా ఇలాంటి ఘటనే జగిత్యాలలో చోటు చేసుకుంది. 2018లో అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ బీరు దొరకడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పుడు కూడా ప్రజావాణి కార్యక్రమంలోనే కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలను నిలిపేసి వాటి స్థానంలో నాసిరకం బీరును అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. పొరుగున కరీంనగర్‌లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడుమరొక ఫిర్యాదు. వ్యక్తులు మారారు కానీ అదే ఫిర్యాదు. బ్రాండ్‌ కూడా అదే.