High Court: గ్రూప్-1 పరీక్ష.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హై కోర్టు
High Court: గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది.
High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పై స్టే ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది. జూన్ 11న నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని 36 అభ్యర్ధులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
స్టే నిరాకరణ..
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పై స్టే ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది. జూన్ 11న నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని 36 అభ్యర్ధులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని.. 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో నియామక పరీక్షల మధ్య నిర్ణీత వ్యవధి ఉండాలని పేర్కొన్నారు. ఆ నిబంధనను టీఎస్ పీఎస్సీ పాటించడం లేదని అందులో తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్.. వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.
36 మంది అభ్యర్థుల కోసం 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు పణంగా పెట్టగలమా అన్న ఏజీ.. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను నాలుగు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.
గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది. టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈలోపు పరీక్ష వాయిదా కోరుతూ 36 మంది అభ్యర్థులు కోర్టుకెక్కడం గమనార్హం.