TREIRB: ముప్పుతిప్పలు పెడుతున్న గురుకుల నియామక బోర్డ్.. వేలాది మంది దరఖాస్తులకు దూరం
TREIRB: గురుకులాల నియామక సంస్థ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన తొలి రోజు నుంచే.. ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి.
TREIRB: గురుకుల బోర్డు.. నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియతో తలెత్తే సాంకేతిక సమస్యలతో.. వేలాది మంది దరఖాస్తులకు దూరం అవుతున్నారు. కొందరు ఫీజు చెల్లించిన.. దరఖాస్తు పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో వేలాదిమంది గురుకల నియామక బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రర్..టైమ్ అవుట్! (TREIRB)
గురుకుల బోర్డు.. నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియతో తలెత్తే సాంకేతిక సమస్యలతో.. వేలాది మంది దరఖాస్తులకు దూరం అవుతున్నారు. కొందరు ఫీజు చెల్లించిన.. దరఖాస్తు పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో వేలాదిమంది గురుకల నియామక బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గురుకల వెబ్‌సైట్ లో సాంకేతిక సమస్యలు.. అభ్యర్ధులకు తలనొప్పిగా మారాయి. వీటిని పరిష్కరించడంలో ఆ సంస్థ బోర్డు పూర్తిగా విఫలం అయింది. సంస్థ నిర్లక్ష్యంతో.. వేలాది మంది దరఖాస్తులకు దూరం కావాల్సి వచ్చింది. గురుకుల విద్యా సంస్థల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ (స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) కొలువులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది.
చివరి రోజు వరకు.. సాంకేతిక సమస్యలు వెంటాడాయి. మరోవైపు.. ఈ సమస్యల నేపథ్యంలో వాటిని పరిష్కరించని అధికారులు, గడువు తేదీ పొడిగింపుపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో రెండ్రోజుల్లో మ్యూజిక్ టీచర్, టీజీటీ దరఖాస్తు ప్రక్రియ సైతం ముగియనుంది. అప్పటివరకు ఇవే సమస్యలు పునరావృతమైతే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఎదురుకానుంది.
తొలిరోజు నుంచే..
గురుకులాల నియామక సంస్థ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన తొలి రోజు నుంచే.. ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గురుకుల సొసైటీల పరిధిలోని 9,231 ఉద్యోగాల భర్తీకి గత నెల 5వ తేదీన బోర్డు ఏకకాలంలో 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గత నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటీఆర్ నమోదు, ఆ తర్వాత దరఖాస్తుల సమర్పణకు ఉపక్రమించిన అభ్యర్థులకు గురుకుల వెబ్‌సైట్ చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్ సతాయింపుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీతో ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగియగా.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుకు దూరమయ్యారు.
మరోసారి వివరాలు..
వన్ టైమ్ రిజిష్ట్రేషన్ చేశాకా కూడా.. దరఖాస్తు ఫారం నింపే సమయంలో కూడా అర్హత వివరాలను మరోసారి నింపాల్సి ఉండటం వల్ల.. అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి వివరాలు ఎంటర్ చేశాకా కూడా.. ఎర్రర్ అని రావడంతో తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు గడువు పెంపు లేనట్టే..!
కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువును గురుకుల బోర్డు పెంచలేదు. దీంతో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు విషయంలోనూ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు బోర్డు అధికారులు నిరాకరిస్తున్నారు.