Last Updated:

Revanth reddy: కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్‌ఆర్‌ను అమ్మేశారు- రేవంత్ రెడ్డి

Revanth reddy: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్ఆర్ ను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Revanth reddy: కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్‌ఆర్‌ను అమ్మేశారు- రేవంత్ రెడ్డి

Revanth reddy: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్ఆర్ ను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్కువ ధరకే.. ముంబయికి చెందిన కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. వెంటనే టెండర్లను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

రేవంత్ ఫైర్.. (Revanth reddy)

సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్ఆర్ ను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్కువ ధరకే.. ముంబయికి చెందిన కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. వెంటనే టెండర్లను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ ప్రజలకు అర్ధం అయ్యేలా వివరిస్తుంది.

ముంబయి కి చెందిన కంపెనీ.. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10శాతం చెల్లించాల్సి ఉంటుంది.

కేటాయించిన రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను నెలరోజుల్లోగా చెల్లించాలి. కానీ ఇవి చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారు.

ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

నిబంధనలు ప్రకారం.. ఈ నెల 26వ తేదీలోగా 10శాతం నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో సంస్థకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని అన్నారు.

సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్‌ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ అన్నారు.

ఇంత దోపిడీ జరుగుతున్నా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేల ఆధారంగానే.. టికెట్ల కేటాయింపు ఉంటుందని అన్నారు.

తన టికెట్‌తో సహా ప్రతి టికెట్‌ కు సర్వేనే ప్రామాణికం. కర్ణాటకలో సిద్దరామయ్యకు కూడా అడిగిన టికెట్‌ కాకుండా సర్వే ఆధారంగానే టికెట్‌ ఇచ్చారు.

పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇన్‌ఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారు.. అది నాకు కూడా వర్తిస్తుంది. పొంగులేటి పార్టీలో చేరిక ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చ చేస్తాం.

ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తాం అని రేవంత్‌రెడ్డి వివరించారు.