Last Updated:

Harish Rao: కాంగ్రెస్ లోనే నిరుద్యోగం.. తెలంగాణలో లేదు: మంత్రి హరీశ్‌ రావు

Harish Rao: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.

Harish Rao: కాంగ్రెస్ లోనే నిరుద్యోగం.. తెలంగాణలో లేదు: మంత్రి హరీశ్‌ రావు

Harish Rao:ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు.. ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి అన్నారు. అలాంటి వారికి అభివృద్ధి అనే ఆయుధంతోనే సమాధానం చెబుతున్నామని అన్నారు. నల్గొండ జిల్లాలో ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ప్రతిపక్షాలపై విమర్శలు..

ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు.. ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి అన్నారు. అలాంటి వారికి అభివృద్ధి అనే ఆయుధంతోనే సమాధానం చెబుతున్నామని అన్నారు. నల్గొండ జిల్లాలో ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కావాలనే కొందరు తెలంగాణపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటివారికి అభివృద్ధి అనే నినాదంతో సమాధానం చెబుతున్నామని మంత్రి అన్నారు.

కాంగ్రెస్ లో నిరుద్యోగం..

తెలంగాణలో కేసీఆర్ పాలన చూసే.. దేశం గర్విస్తోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌ తప్ప మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు వెనుకబడ్డాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేసే విష ప్రచారాలకు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో బుద్ధి చెప్పాలని సూచించారు. నిరుద్యోగం పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ అసలైన నిరుద్యోగం కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని అన్నారు.

రానున్న ఎన్నికల్లో మళ్లీ రాబోయేది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వైపే ప్రజలు నిలబడి ఉన్నారని మంత్రి అన్నారు.