Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబుది దిగజారుడు రాజకీయం .. సజ్జల రామకృష్ణారెడ్డి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ,ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sajjala Ramakrishna Reddy:ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ,ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, కౌన్సిల్లో మద్దతు ఇచ్చిన టీడీపీ..(Sajjala Ramakrishna Reddy)
సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారన్నారు . ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు . 2019 జూలై 29వ తేదీన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు .ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది. శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. గత 15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ విష ప్రచారం చేస్తోందని తెలిపారు .
చంద్రబాబు హయాంలోనే ఈ-స్టాంపింగ్ విధానం ..
అసలు ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైందని సజ్జల పేర్కొన్నారు . తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి అని చెప్పారు . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదు అని ప్రశ్నించారు . చంద్రబాబు కాలంలో ఇబ్బందులు పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూములు సమస్యను సీఎం జగన్ పరిష్కరించారని తెలిపారు . బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కూడా భూములు కొన్నారు. మరి వాళ్ళు కొన్న భూమి పత్రాలు కూడా జిరాక్స్ కాపీలేనా? అంటూ ప్రశ్నించారు . ప్రజలు భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వివరించారు . భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది’ అని తెలిపారు .