Minister Satyavathi Rathode: మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్లకు బొబ్బలు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటూ కొంతకాలంగా చెప్పులు లేకుండా నడుస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. మంత్రి సత్యవతి సంకల్ప దీక్షకి భానుడి ప్రతాపం సవాల్‌గా మారింది.

Minister Satyavathi Rathode: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటూ కొంతకాలంగా చెప్పులు లేకుండా నడుస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. మంత్రి సత్యవతి సంకల్ప దీక్షకి భానుడి ప్రతాపం సవాల్‌గా మారింది.
కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు..(Minister Satyavathi Rathode)
46 డిగ్రీల మండుటెండలోసైతం పాదరక్షలు లేకుండా సత్యవతి రాథోడ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతేడాది సెప్టెంబర్ 17నుంచి పాదరక్షలు లేకుండా సత్యవతి రాథోడ్ తిరుగుతున్నారు. 9 నెలలుగా ఆమె చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. రెండురోజుల క్రితం మరణించిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియల సందర్భంగా చెప్పులు లేకుండా మంత్రి మూడు కిలోమీటర్లు నడిచారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆమె కాళ్ళకి బొబ్బలు వచ్చాయి. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు మంత్రి సత్యవతి రాథోడ్‌కి సూచించారు. తన దైవం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు సంకల్ప దీక్ష ఆపబోనని సత్యవతిరాథోడ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Pawan Kalyan Varahi Yatra : జనసేనాని పవన్ రాకతో జనసంద్రమైన అన్నవరం.. భారీ బందోబస్తు నడుమ “వారాహి యాత్ర”
- Pawan Kalyan Varahi Yatra : నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ప్రారంభం.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ !