Last Updated:

Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా నేతల గృహ నిర్భంధం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస చేసి బస్సు నుంచి కిందకు రాగానే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబును సిట్, సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని విజయవాడకు తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా నేతల గృహ నిర్భంధం

Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస చేసి బస్సు నుంచి కిందకు రాగానే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబును సిట్, సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని విజయవాడకు తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐతే.. తన అరెస్టుకు కారణం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైమా ఫేసీ లేకుండా అరెస్టు చెయ్యడానికి ఏం అధికారం ఉందని పోలీసులను ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు. నంద్యాల నుంచి విజయవాడ వరకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాలకు ఎక్కడా అడ్డురాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం

చంద్రబాబు ఫారెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి చెందిన పులువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులపై పోలీసుల నిఘా పెంచారు. టీడీపీ సానుభూతిపరుల పైన నిఘా పేట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అలెర్ట్ ప్రకటించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగా బస్సులు నిలిపివేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరి తీయండి అంటూ చంద్రబాబు ఛాలెంజ్‌ విసిరారు. దర్యాప్తు అధికారి రాకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తాను ప్రజాసమస్యలపై పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని చూస్తోందని అన్నారు.

సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 ఎండ్‌ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద  కేసులు నమోదు చేశారు.