Home / ఆంధ్రప్రదేశ్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా.. ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రవిబాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. జీవితంలో ఏది శాశ్వతం కాదండి.. సినిమా వాళ్ల గ్లామర్ గానీ, రాజకీయ నాయకుల పవర్‌గానీ, అస్సలు శాశ్వతం కాదు.
జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ ఈరోజు విడుదల చేశారు. ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ నడుపుతూ జీవినం సాగించే వారి కోసం ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ 2019లో వైఎస్సార్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్‌ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై హోంమంత్రి అమిత్ షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉల్లంఘించారంటూ ఆధారాలు సమర్పించారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి సిఐడి చీఫ్ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి