Last Updated:

Flipkart Sale: సగం ధరకే టీవీలు, ఫోన్లు, కెమెరాలు.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డేస్ సేల్.. ఓరయ్యా ఇది విన్నారా..!

Flipkart Sale: సగం ధరకే టీవీలు, ఫోన్లు, కెమెరాలు.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డేస్ సేల్.. ఓరయ్యా ఇది విన్నారా..!

Flipkart Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం రిపబ్లిక్ డే సేల్ 2025ని ప్రారంభించబోతుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ పేరుతో తీసుకొస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా మీ ఇంటికి  ఏదైనా గ్రహొపకరణాన్ని కొనుగోలు చేయాలంటే ఈ సేల్‌లో వాటిపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. అతి తక్కువ ధరకే స్మార్ట్‌టీవీలను కూడా ఆర్డర్ చేయచ్చు.

మీరు మీ ఇంటి పాత టీవీని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే మీకు గొప్ప అవకాశం ఉంది. మాన్యుమెంటల్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులను అందించబోతోంది. ఈ సేల్‌లో మీరు కేవలం రూ.7000కే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయచ్చు.,

ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌తో మీరు 50శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో 32 అంగుళాల నుండి 43 అంగుళాలు, 55 అంగుళాల వరకు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయగలుగుతారు. విశేషమేమిటంటే ఈ సేల్ నుండి మీరు Samsung, Xiaomi, Redmi, LG, Sony, Toshiba, OnePlus వంటి బ్రాండ్‌ల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని భారీ తగ్గింపులతో చౌక ధరలకు కొనుగోలు చేయచ్చు.

మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్‌లో చౌక ధరకు DSLR కెమెరాను కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 25,900కే కెమెరాను కొనుగోలు చేయగలుగుతారు. సేల్ ఆఫర్‌లో కేవలం రూ.99కే ల్యాప్‌టాప్ యాక్సెసరీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు గేమర్ అయితే, గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు దానిని కేవలం రూ.45,990కి బుక్ చేయచ్చు. సాధారణ ఉపయోగం కోసం, మీరు 10,990 రూపాయలకు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఆనందించబోతున్నారు. సేల్ ఆఫర్‌లో మీరు కేవలం రూ. 15,999కి QLED టీవీని కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో కేవలం రూ.7000కే స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే గొప్ప అవకాశాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఇది కాకుండా, మీరు వాటర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు దానికి కేవలం రూ. 6999 కేటాయించాల్సి ఉంటుంది.