Last Updated:

Mekapati Chandrasekhar Reddy : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత..

నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. నిన్నటి వరకు మేకపాటి, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.

Mekapati Chandrasekhar Reddy : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత..

Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. నిన్నటి వరకు మేకపాటి, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు.. రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు.

ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు. అయితే మేకపాటి వెళ్లిపోయిన కొద్దిసేపటికి వైఎస్సార్‌సీపీ నేతలు బస్టాండ్ దగ్గరకు వచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే ఇప్పుడు రావాలని సవాల్ చేశారు. తాము లేని సమయం చూసి రావడం కాదని.. ఇప్పుడు బస్టాండ్ సెంటర్‌కు రావాలన్నారు. దీంతో రెండు గ్రూపుల మధ్య వివాదం మరింత ముదిరింది.

ఈ తరుణంలో ఈరోజు కూడా నెల్లూరులో ఉద్రిక్తత వాతావరణం నడిచింది. కానీ అనుకోని రీతిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండె నొప్పి రావడంతో మర్రిపాడు లోని ఆయన నివాసంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని మీడియాకు చెప్పారు. అయితే మేకపాటి ఆరోగ్య పరిస్థితిని బట్టి చెన్నైకి తరలించేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్‌లో కూడా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో బెంగళూరులో సర్జరీ చేసి స్టెంట్‌ వేసిన సంగతి తెలిసిందే.

కాగా మరోవైపు ఈ సవాళ్ల పర్వం ఈరోజు కూడా కొనసాగాయి. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ రెడ్డిని సవాల్‌ చేస్తూ బస్టాండ్‌ దగ్గర వైఎస్సార్‌సీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి కుర్చీలో కూర్చున్నారు. తనకు మేకపాటిలా మాట్లాడటానికి సంస్కారం అడ్డు వస్తుందన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే కోట్ల రూపాయలు దండుకున్నారని.. పార్టీనీ నాశనం చేసి, టీడీపీకి అమ్ముడు పోయారంటూ వినయ్ ఫైర్ అయ్యారు.