Last Updated:

Duranto Express: ఏలూరులో రైలు ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌

Duranto Express: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ బోలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది.

Duranto Express: ఏలూరులో రైలు ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌

Duranto Express: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ బోలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. ఈ ప్రమాదం గురువారం వేకువజామున చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

నిలిచిపోయిన రైలు..

ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ బోలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. ఈ ప్రమాదం గురువారం వేకువజామున చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంతో గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. భీమడోలు జంక్షన్ వద్ద.. రైలు వస్తుండటంతో రైల్వే గేటును మూసివేశారు. అదే సమయంలో.. బొలెరోలో వచ్చిన కొంతమంది రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా బొలేరో వాహనం ట్రాక్ పైకి వచ్చింది. అదే సమయంలో.. దురంతో ఎక్స్ ప్రెస్ దగ్గరికి రావడంతో.. అందులోని ప్రయాణికులు ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రైలు ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో పూర్తిగా ధ్వంసమైంది.

రైలు ఇంజిన్ ముందు భాగం కాస్త దెబ్బతినడంతో.. మరో ఇంజిన్ అమర్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కువ సమయం పట్టడంతో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు విచారణ చేపట్టారు.