Mulugu MLA Seethakka: భాజపా ప్రజల్లో విషపు మొక్కలు చిమ్ముతోంది…రాహుల్ పాదయాత్రలో సీతక్క
భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో విషపు మొక్కలు నాటుతోందని తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న భారత జోడో యాత్రలో భాగంగా ఆమె ఆదోని మండలంలో రాహుల్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు.

Bharat Jodo Yatra: భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో విషపు మొక్కలు నాటుతోందని తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న భారత జోడో యాత్రలో భాగంగా ఆమె ఆదోని మండలంలో రాహుల్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఏపీలో నాలుగు రోజులపాటు రాహుల్ పాదయాత్ర 119కి.మీ మేర సాగనుంది. అనంతరం తెలంగాణాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాహుల్ పాదయాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో తీరును ఆమె ప్రస్తావించారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డా అన్నారు. అధికార పార్టీ తెరాస డబ్బులతో పోటీపడుతుందన్నారు. అయితే ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్న ధీమాను సీతక్క వ్యక్తం చేశారు. ఏపీలో, రాహుల్ పాదయాత్రలో పలువురు తెలంగాణ నేతలు పాల్గొని తమ నేతకు సంఘీభావం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి:Rahul Gandhi: రాజధానిగా అమరావతికే నా మద్ధతు..రాహుల్ గాంధీ