Director Sagar : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ సాగర్ మృతి
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్నాయి.కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు, సీనియర్ నటి జమున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇటీవల మృతి చెందారు.కాగా ఇప్పుడు తాజాగా పరిశ్రమలో మరో మరణ వార్త అందరిలో విషాదం నింపింది.ప్రముఖ తెలుగు దర్శకుడు ‘విద్యాసాగర్ రెడ్డి’ నేడు కన్ను మూశారు.
Director Sagar : తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్నాయి.
కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు, సీనియర్ నటి జమున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇటీవల మృతి చెందారు.
కాగా ఇప్పుడు తాజాగా పరిశ్రమలో మరో మరణ వార్త అందరిలో విషాదం నింపింది.
ప్రముఖ తెలుగు దర్శకుడు ‘విద్యాసాగర్ రెడ్డి’ నేడు కన్ను మూశారు.
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన ఈరోజు ఉదయం చెనైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాకు సాగర్ కన్ను మూసినట్టు ఆయన తనయుడు వెల్లడించారు.
గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్నారు సాగర్.
చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన మరణించారు.
మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామంలో 1952 మార్చి 1న జన్మించిన విద్యాసాగర్ రెడ్డి 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.
ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
40 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నరేష్, విజయ్ శాంతి కలయికలో తెరకెక్కిన ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన విద్యాసాగర్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు.
ఆ తరువాత కూడా స్టూవర్టుపురం దొంగలు, అమ్మదొంగ, రామసక్కనోడు వంటి హిట్ సినిమాలతో కెరీర్ మొత్తంలో సక్సెస్ రేటుని ఎక్కువ చూశారు.
సుమన్, భానుచందర్ లతో ఎక్కువ సినిమాలు తీసిన విద్యాసాగర్ కృష్ణ, రవితేజలతో కూడా చిత్రాలు తెరకెక్కించాడు.
తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా (Director Sagar) సాగర్..
సాగర్ డైరెక్ట్ చేసిన రామసక్కనోడు సినిమాకు మూడు నంది పురస్కారాలు లభించాయి.
శ్రీను వైట్ల, వివి వినాయక్ లాంటి ఎంతో మంది దర్శకులు సాగర్ దగ్గర పనిచేసినవారే.
అంతే కాదు తెలుగు ఫిలిం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా సాగర్ పనిచేశారు.
తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు సాగర్.
ఆయన మృతికి సంతాపంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/