Last Updated:

Vote By Boat: త్రిపురలో పడవల్లో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలు

దేశవ్యాప్తంగా రెండో దశ లోకసభ ఎన్నికల పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే త్రిపురలోని మారుమూల ప్రాంతమైన దాలాయి జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బోటు ద్వారా ప్రయాణం చేసి ఓటు వేసి రావాల్సిందే.

Vote By Boat: త్రిపురలో పడవల్లో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలు

Vote By Boat:  దేశవ్యాప్తంగా రెండో దశ లోకసభ ఎన్నికల పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే త్రిపురలోని మారుమూల ప్రాంతమైన దాలాయి జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బోటు ద్వారా ప్రయాణం చేసి ఓటు వేసి రావాల్సిందే. కాగా ఎలక్షన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా తమ అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌ ద్వారా త్రిపుర ప్రజలు బోట్‌లలో ప్రయాణించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది. దీనికి ‘ఓట్‌ బై బోట్‌” క్యాప్షన్‌కూడా పెట్టింది. 44/68 రెయిమా వ్యాలీ ఏఎస్‌కు వెళ్లడానికి మారుమూల ప్రాంతానికి చెందిన వారు బోట్‌ల ద్వారా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

త్రిపురలో పెరిగిన ఓటింగ్ శాతం..(Vote By Boat)

మొత్తానికి చూస్తే త్రిపురలో ఓటింగ్‌ శాతం పెరిగింది. ఈశాన్య ప్రాంతంలో ఉదయం 11.00 గంటల వరకు ఓటింగ్‌ శాతం 36.42 శాతానికి చేరిందని ఈసీఐ తెలిపింది. చత్తీస్‌గఢ్‌ విషయానికి వస్తే 35.47 శాతం, మణిపూర్‌లో 33.32 శాతం, పశ్చిమ బెంగాల్‌ విషయానికి వస్తే 31.25 శాతం, మహారాష్ర్టలో మాత్రం అతి తక్కువగా 18.83 శాతం మాత్రమే నమోదైంది. ఇక అస్సాంలో 27.43 శాతం, బిహార్‌లో 21.68 శాతం, జమ్ము కశ్మీర్‌లో 26.61 శాతం, కర్ణాటకలో 22.34 శాతం, కేరళలో 25.61 శాతం, మధ్యప్రదేశ్‌లో 28.15 శాతం, రాజస్థాన్‌లో 26.84 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24.41 శాతం పోలింగ్‌ జరిగింది.

లోకసభ రెండవ విడత పోలింగ్‌ విషయానికి వస్తే 13 రాష్ర్టాల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. వాటిలో కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లో 13, కేరళలో 20, మహారాష్ర్టంలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, అస్సాం, బిహార్‌లో చెరో ఐదు, మధ్యప్రదేశ్‌లో ఆరు, చత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లో చెరో మూడు చొప్పున, త్రిపుర, మణిపూర్‌, జమ్ము కశ్మీర్‌లో చెరో లోకసభ నియోజకవర్గానికి పోలింగ్‌ జరుగుతోంది. ఇక వాతావరణం విషయానికి వస్తే సాధారణంగానే ఉంది. ఓటర్లు ఉత్సాహంగానే పోలింగ్‌ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఓటర్లు సౌకర్యార్థం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. మండిపోతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈసీ అధికారులు దానికి తగ్గట్లు ఏర్పాటు చేశారు.

ఎన్నికల కమిషన్‌ అధికారుల సమాచారం ప్రకారం రెండవ విడతలో 15.58 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు 5,959 మంది థర్డ్‌ జెండర్‌ అని తెలిపింది. మొత్తం 4,553 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్‌, 5,731 మంది స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌, 1,462 మంది వీడియో సర్వెలెన్స్‌ టీం,844 మంది వీడియో వ్యూయింగ్‌ కోసం 1.67 లక్షల మంది పోలింగ్‌స్టేషన్లపై నిరంతరం సర్వెలెన్స్‌ లేదా నిఘా కొనసాగిస్తారని ఈసీ ఒక ప్రకటనలో వివరించింది.