Home / Tripura
దేశవ్యాప్తంగా రెండో దశ లోకసభ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే త్రిపురలోని మారుమూల ప్రాంతమైన దాలాయి జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బోటు ద్వారా ప్రయాణం చేసి ఓటు వేసి రావాల్సిందే.
భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు.
త్రిపురలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మాణిక్ సాహా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే మార్గం సుగమం అయింది.ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది.
తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో త్రిపురలోని ధన్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి గెలిచిన కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు
మూడు ఈశాన్య రాష్ట్రాలయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీని దక్కించుకుంది
ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది.