PM Modi in Jharkand: రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాక్ నేతలు కోరుకుంటున్నారు.. ప్రధాని మోదీ
గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్‌లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది.
PM Modi in Jharkand: గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్‌లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది. ఇవన్నీ 2014 లోకసభ ఎన్నికలకు ముందు జరిగిన తంతు. మీ ఓటుతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్టుల ఆనవాళ్లు లేకుండా చేశామని ప్రధాని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ నాయకుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారు కోరుకునేది ఒక్కటే … కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వారు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమలేఖలు రాసేది.. (PM Modi in Jharkand)
గతంలో దేశంలోకి టెర్రరిస్టులు స్వేచ్చగా వచ్చి అమాయకులను చంపేవారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ప్రేమలేఖలు రాసేది. అయినా పాక్‌పాలకులు పట్టించుకొనే వారు కాదు. మీ ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశంలోకి టెర్రరిస్టు వచ్చి దాడి చేసిపోతే… వారిని పాకిస్తాన్‌లో ఎక్కడున్నా వేటాడి చంపిరావాల్సిందేనని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో జార్ఖండ్, బిహార్‌కు చెందిన ప్రజలు సరిహద్దులో కాపలా కాసే వారు. ప్రతినెల ఈ ప్రాంతానికి చెందిన అమాయకులు చనిపోయేవారు. అప్పటి పిరికిపంద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచముందు పాకిస్తాన్ ఇలా చేసింది.. అలా చేసింది అని ఫిర్యాదులు చేసేది.
బాలాకోట్ సర్జికల్ స్ర్టయిక్ తర్వాత పాకిస్తాన్‌కు ఇండియా తడఖా తెలిసివచ్చింది. ఇప్పడు పాకిస్తాన్ ప్రపంచం ముందు బచావ్ .. బచావ్ అంటూ గావు కేకలు పెడుతోంది. తత్వం బోధపడిన పాకిస్తాన్‌ఇప్పుడు యువరాజు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రార్థనలు జరుపుతోందని జార్ఖండ్‌లోని పలాములో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. ఇండియా బలంగా ఉండాలంటే బలమైన ప్రభుత్వం ఉండాలన్నారు. 2014లో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దేశం నుంచి నక్సలిజం, టెర్రరిజం, ఆర్టికల్ 370ను ఎత్తివేశామని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా మాజీ పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి రాహుల్‌గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్ సోషలిస్టు సిద్దాంతాలు కలిగిన వారని కొనియాడారు. ఆయన తాత జవహర్‌లాల్ నెహ్రూ మాదిరిగానే రాహుల్ కూడా సోషలిస్టు సిద్దాంతాలు కలిగి ఉన్నారన్నారు. దేశ విభజన తర్వాత గత 75 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఒకే రకమైన సమస్యలున్నాయన్నారు.రాహుల్ గాంధీ ఇటీవల తన ప్రసంగంలో దేశంలోని 70 శాతం సంపద కేవలం 30 నుంచి 50 కుటుంబాల చేతిలో ఉందన్నారు. ఇక్కడ అంటే పాకిస్తాన్‌లో కూడా పాక్ బిజినెస్ కౌన్సిల్, రియల్ ఎస్టేట్ యజమానుల చేతిలో దేశంలోని 75 శాతం సంపద ఉంది. ఇరు దేశాల్లో సంపదను ప్రజలకు పంచడం పెద్ద సమస్యగా ఉందన్నారు పవాద్. కాగా జార్ఖండ్ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగనున్నాయి. మే 13,20,25, జూన్1. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ 12 సీట్లు గెలుచుకోగా బీజేపీ 11 సీట్లు, జార్ఖండ్ ముక్తి మోర్చా , కాంగ్రెస్ పార్టీలు చెరో సీటు గెలుచుకున్నాయి.