Last Updated:

5G Mobiles Under 10K: రూ.10 వేల లోపు ఖతర్నాక్ 5జీ ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్.. ఊహించని డిస్కౌంట్స్..!

5G Mobiles Under 10K: రూ.10 వేల లోపు ఖతర్నాక్ 5జీ ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్.. ఊహించని డిస్కౌంట్స్..!

5G Mobiles Under 10K: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. సరికొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తోంది. అంతే కాకుండా రూ.10 వేల బడ్జెట్‌లోనే ప్రీమియం 5జీ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశాలు కల్పిస్తోంది. ఈ జాబితాలో సామ్‌సంగ్, వివో, మోటో, పోకో వంటి బ్రాండ్లు ఉన్నాయి. రండి ఈ మొబైల్స్‌పై అందుబాటులో ఉన్న డీల్స్ గురించి తెలుసుకుందాం.

1.Samsung Galaxy A14 5G
సేల్‌లో ఎయిర్‌టెల్, బ్యాంక్ ఆఫర్ తర్వాత 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ Samsung ఫోన్ వేరియంట్ రూ.9,736కి అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో లభించే ఎక్స్ఛేంజ్ బోనస్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఫోన్‌లో 6.6-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

2. Vivo T3 Lite 5G
బ్యాంక్ ఆఫర్ తర్వాత 4GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ Vivo ఫోన్  వేరియంట్ రూ.9,499కి అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో లభించే ఎక్స్ఛేంజ్ బోనస్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఫోన్‌లో 6.56 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డైమెన్షన్ 6300 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది.

3. Moto G35 5G
సేల్‌లో, బ్యాంక్ ఆఫర్ తర్వాత 4GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ రూ.9,499కి అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా దీని ధరను తగ్గించవచ్చు. 12 5G బ్యాండ్‌లతో సెగ్మెంట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన 5G ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, యూనిసాక్ T760 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP52 రేటింగ్‌తో వస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతునిస్తుంది.

4. POCO C75 5G
Poco దీన్ని ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన ఫోన్  ఏకైక వేరియంట్ బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత రూ.7,599కి సేల్‌లో అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఫోన్‌లో 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 5G ప్రాసెసర్, 5160 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్‌లో Jio  5G మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి.

5. Redmi 13C 5G
బ్యాంక్ ఆఫర్ తర్వాత 4GB RAM +128GB స్టోరేజ్ కలిగిన ఫోన్  వేరియంట్ 8,311 రూపాయలకు సేల్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా దీని ధరను తగ్గించవచ్చు. ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మీడాయాటెక్ డైమన్సిటీ 6100+ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి.