Home / తాజా వార్తలు
Allu Arjun Bail Petition Postponed: సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించింది. దీంతో […]
Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన 92 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి స్పందన వస్తోంది. యోగి ప్రభుత్వంలో మంత్రి, మాజీ పోలీసు అధికారి అసీమ్ అరుణ్ కూడా ఆయనకు నివాళులర్పించారు. అతనికి నివాళులు అర్పిస్తూ అసిమ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఇలా రాశారు, ఇది మన్మోహన్ సింగ్ సరళతను కూడా చూపిస్తుంది. అసిమ్ […]
Manmohan Singh’s Economic reforms decisions that shaped a billion lives: భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 26న గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఆర్థికమంత్రిగా పనిచేశారు. భారతదేశ ప్రధానిగా ఎక్కువకాలం చేసిన ప్రధానమంత్రుల్లో ఆయన ఒకరుగా నిలిచారు. మన్మోహన్ సింగ్‌ను భారత దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా […]
RRR Behind and Beyond Documentary: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్గా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. 2022లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియాభట్, ఓలివియా మోరిస్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. […]
iPhone 16: గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆపిల్ ఎటువంటి గ్యాడ్జెట్లను తీసుకొస్తున్న ఎక్కడలేని హైప్ క్రియేట్ చేస్తుంటి. అటువంటి వాటిల్లో ఒకటి ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు. వీటిని దక్కించుకొనేందుకు మొబైల్ ప్రియులు పోటీపడ్డారు. మీరు ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఐఫోన్ 16 ధరలో ఇప్పటివరకు అతిపెద్ద కోత […]
India vs Australia 4th Test second Day Australia all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ 5 టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 311 పరుగులు చేయగా.. రెండో రోజు తొలి ఐదు ఓవర్లలో 21 […]
Allu Arjun Will Attend Nampally Court: సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏ11 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. అయితే నేటితో (డిసెంబర్ 27) కోర్టు విధించిన రిమాండ్ పూర్తి అవుతుంది. […]
Amitabh Bachchan About Allu Arjun: బాలీవుడ్ బిగ్‌బి మరోసారి అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. లేటెస్ట్ ఎపిసోడ్లో కోల్‌కతాకు చెందిన రజనీ బర్నివాల్ మహిళ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్‌తో అల్లు అర్జున్ పోల్చింది. తనకు అమితాబ్ బచ్చన్ ఇంకా అల్లు అర్జున్ అంటే ఇష్టమని, మీ ఇద్దరికి వీరాభిమానిని అని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై దీనికి బిగ్‌బి స్పందిస్తూ.. “అతనితో నన్ను పోల్చకండి. […]
Telangana TET 2024 Hall Tickets released: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్షలకు మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జనవరి 8, 9, 10,18తేదీలలో టెట్ పేపర్ -1 పరీక్ష ఉండగా.. టెట్ పేపర్ -2 పరీక్ష జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీలలో ఉండనుంది. […]
Telangana Government Declared Public Holiday in Honor of Former PM Manmohan Singh: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలు సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సెలవు ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారంరోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు […]