Last Updated:

Mechanic Rocky: విశ్వక్‌ సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Mechanic Rocky: విశ్వక్‌ సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Vishwak Sen Mechanic Rocky OTT Details: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రారంభంలో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీతో వచ్చిన హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత గ్యాంగ్స్‌ గోదావరి విడుదల కాగా అది నిరాశ పరిచింది.

తాజాగా మెకానిక్‌ రాకీతో వచ్చాడు. నిన్న (నవంబర్‌ 22) ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫాదర్ సెంటిమెంట్, లవ్ ఎంటర్‌టైనర్‌గా మెకానిక్‌ రాకీ యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఇందులో విశ్వక్ సేన్ యాక్టింగ్, యాక్షన్‌ బాగుందంటూ ఆడియన్స్ నుంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇక మూవీకి పాజిటివ్ బజ్ ఉండటంతో మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్‌, స్ట్రీమింగ్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది.

రిలీజ్‌కు ముందు మెకానిక్‌ రాకీ ప్రమోషనల్‌ కంటెంట్‌తో మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. దీంతో మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో రిలీజ్‌కు ముందే మెకానిక్‌ రాకీ ఓటీటీ డీల్‌ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైం ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ సొంతం చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్‌ రన్‌ పూర్తయ్యాకే ఓటీటీకి వస్తుంది.

అయితే మూవీ వస్తున్న రెస్పాన్స్‌ బట్టి ఈ సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి. మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాల నెల రోజుల తర్వాతే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తుండగా.. మరికొన్ని నెల రోజుల ముందే ఓటీటీకి వస్తున్నాయి. మరి మెకానిక్‌ రాకీ ఓటీటీకి వచ్చేది ఎప్పుడనేది ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేయిట్‌ చేయాల్సిందే. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం డిసెంబర్‌ చివరి వారంలో ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.