Mumbai Indians – IPL, 2025: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ముంబై స్పిరిట్ కోచ్‌గా బాలీవుడ్ ఐకాన్!

Mumbai Indians Introduce Jackie Shroff As Spirit Coach: ఐపీఎల్ 2025 మెగా టోర్నీ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిరిట్ కోచ్‌గా బాలీవుడ్ ఐకాన్ జాకీ షాఫ్‌ను తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను కూడా ముంబై ఇండియన్స్ విడుదల చేసింది.
తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదల పెంచేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ ఇలాంటి వినూత్న ఆలోచన చేయలేదు. తొలిసారి ముంబై ఇండియన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఈ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తొలి మ్యాచ్ మధ్య జరగనుంది.
ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 23న ఆడనుంది. ఐపీఎల్ 2024లో గ్రూపు స్టేజికే పరిమితమైన ముంబై.. ఈ ఏడాది సీజన్‌లో సత్తాచాటాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లు ముంబై శిబిరంలో చేరారు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా):
విల్ జాక్స్/ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాబిన్ మింజ్ (కీపర్), మిచెల్ సాంట్నర్, అల్లా ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, జస్రీత్ బుమ్రా.