Last Updated:

Kodi Pandalu: అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యధేచ్చగా కోడిపందాలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది.

Kodi Pandalu: అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యధేచ్చగా కోడిపందాలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Kodi Pandalu: సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది.

అయితే బరిలోకి దిగే పుంజుకు ఎంత విలువ ఉంటుందో.. ఆ పోటీలో గెలిచే పుంజుకు పది రెట్ల విలువ ఉంటుంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా సాగుతున్న సంక్రాంతి కోడిపందాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్దఎత్తున కోనసీమకు తరలివస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా రెండు వందల 50 బరులు ఏర్పాటు చేసి కోట్లలో పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుతుంది.

హైదరాబాద్, తెలంగాణ, పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కోడి పందాలను వీక్షిస్తూ సరదాగా గడుపుతున్నారు.

సినిమా తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతల ఎంట్రీతో కోడిపందాల జోరు కొనసాగుతోంది.

కోడిపందేలు, గుండాట నిర్వహణకు సిద్ధం చేస్తున్న బరుల్ని తొలగించేందుకొచ్చిన పోలీసులపై ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విరుచుకుపడ్డారు.

ఇది ప్రైవేటు స్థలమని, మీరెందుకొచ్చారని, వెంటనే వెళ్లిపోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

‘పోలీసులెవరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇది మా సొంత స్థలం. మీ ప్రమేయం ఏమిటి? ఇక్కడ కోడి పుంజులుగానీ, ఇతర ఆటల సామగ్రిగానీ ఏమీ లేవు.

కావాలంటే మమ్మల్ని కట్టేసుకుని తీసుకుపోండి’ అంటూ పోలీసులపై రుసరుసలాడారు.

మీరిక్కడి ఎందుకు వచ్చారంటూ ఎస్.ఐపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడులోని వెదిరేశ్వరం రోడ్డు పక్కన పందేల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను తొలగించేందుకు రావులపాలెం అదనపు ఎస్‌.ఐ.సురేంద్ర సిబ్బందితో రాగా జగ్గిరెడ్డి వారిపై మండిపడ్డారు.

కాకినాడ రూరల్ లో కోడిపందాల నిర్వాహకులు ఆకర్షణీయమయిన బహుమతులు అందచేస్తున్నారు. వందల బరుల్లో కోడిసందాలు సాగుతున్నాయి.

పందేల్లో గెలిచిన కోడిపుంజు యజమానులకు రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ఖరీదైన బైకులు బహుమతులు అందచేస్తున్నారు.

రాత్రి వేళల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి కోడిపందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

కాగా పోలీసుల హెచ్చరికలు నేపధ్యంలో గుండాటలు, గ్యాంబ్లింగ్ గేమ్స్ పై నిషేధం కొనసాగుతుంది. కానీ వాటిని కూడా రహస్యంగా నిర్వహిస్తున్నారని సమాచారం అందుతుంది.

చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ఆటల్లో పాల్గొంటున్నారు. ప్రతి గుండాట దగ్గర లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణ జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో బోర్డులు పెట్టి.. లోపల మాత్రం కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం, టి.నరసాపురం, నిడమర్రు మండలం మందలపర్రిలో కోడిపుంజులకు కత్తులు కట్టిన పందెం రాయుళ్లు వాటిని బరిలోకి దింపుతున్నారు.

అలాగే జాలివుడి, చాటపర్రులో జోరుగా గుండాట ఆడుతున్నారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఇరగవరం, తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోనూ కోడి పందేలు ప్రారంభమయ్యాయి.

కొన్ని ప్రాంతాల్లో కోడి పందేల బరుల వద్ద నిర్వాహకులు ప్రైవేటు బౌన్సర్లతో రక్షణ ఏర్పాట్లు చేసుకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో పందేలను డిజిటల్‌ స్క్రీన్లపై లైవ్‌ పెట్టారు.

కోడి పందేలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక కోడి పందేల పేరుతో రూ. కోట్లలో చేతులు మారుతున్నాయి.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోనూ కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. రెండు జిల్లాల్లో 100కు పైగా బరులను ఏర్పాటు చేశారు.

అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతల కనుసన్నల్లో వీటిని నిర్వహిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/