Last Updated:

Pawan Kalyan In Tanuku: నువ్వూ నీ ఎర్రిపప్ప ప్రభుత్వం.. నువ్ కొంపలంటిస్తుంటే.. జనసేన గుండెలంటిస్తుంది అంటూ జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan In Tanuku: నువ్వూ నీ ఎర్రిపప్ప ప్రభుత్వం.. నువ్ కొంపలంటిస్తుంటే.. జనసేన గుండెలంటిస్తుంది అంటూ జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మీరు మీ మద్దతుదారులు ఇష్టానుసారంగా నన్ను తిడుతున్నారే.. నేను అంటే జగన్ ను జగ్గూభాయ్ అంటే మాత్రం వైసీపీ నేతలకు ఒంటిమీద కారాలు పూసుకున్నట్టుంది. ఏ మేం భరించడం లేదా మీరు కూడా భరించండి అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. జగన్ నుంచి జగ్గూ భాయ్ అయ్యారు ఇంకా ఎక్కువ చేస్తే జగ్గు అంటాను ఇంకా మితిమీరితే నేనేమంటానో నాకే తెలియదు.. మీరు నోరు జారితే నేను జారతా అంటా వైసీపీ నేతలపై పవన్ గట్టి కౌంటర్స్ వేశారు. మీ ఎర్రిపప్ప టాక్స్ వేసి ప్రజలను మోసం చెయ్యకు జగన్ అంటూ వైసీపీ నేతలపై ఇండైరెక్ట్ గా సెటైర్లు గుప్పించారు పవన్ కళ్యాణ్.

అందుకే నేను జగ్గూభాయ్ అంటున్నా(Pawan Kalyan In Tanuku)

వైసీపీ కొంపలంటిస్తుందని.. జనసేన గుండెలంటిస్తుందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పోరాటం పొలిటికల్ కరప్షన్, వైసీపీ దురాక్రమణ పాలన మీదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ కు సగటు మనిషి కష్టాలేంటో తెలుసా.. పప్పులు ఉప్పుల రేట్లు అన్నీ పెంచేశావ్.. రైతులకు అండగా ఉంటానని చెప్పి వారికి కనీస మద్ధతు ధరను కూడా ఇవ్వడం లేదంటూ ఆయన జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. నువ్ ప్రజల డబ్బు దొంగతనం చేశావ్ ఇది నేను చెప్పింది కాదు సుప్రీం కోర్ట్ చెప్పింది.. అందుకే నిన్ను జగ్గూభాయ్ అంటున్నానంటూ పవన్ చెప్పుకొచ్చారు. గళ్ల లుంగీ ఎర్రచొక్క ముఖంపై పుట్టుమచ్చ పెట్టాలి నువ్ చేసే వెధవ పనులకు అంటూ పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు చేశారు. గతంలో 60 రూపాయల ఉండే మందును నీ పాలనలో 120 రూపాయలు చేశావు. మధ్యపాన ప్రియుల పొట్టకొట్టావ్.. మద్యపాన నిషేధం అని చెప్పి 30వేల కోట్లు దోచేశావ్ అంటూ వైసీపీ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూధర్మం జోలికొస్తే తాటతీస్తా

అలాగే మీవల్ల 32 మంది భవనకార్మికుల చనిపోయారు. వారి పొట్టకొడుతున్నావ్.. మీ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు జగన్.. మీ చెత్తపాలనలో చెత్తపై కూడా పన్ను వేశావ్ అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎలాగో కంప్లీట్ చెయ్యలేవు కానీ ఎర్రకాలువను అయినా సరిచేయొచ్చు కదా అంటూ పవన్ సూచించారు. అలాగే ఇటీవల కాలంలో పురోషితులను వేలం వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఇకపోతే వైసీపీ నేతలు హిందూధర్మాన్ని అగౌరవపరుస్తున్నారని దేవాలయాలను అవమానపరుస్తున్నారంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గతంలోనూ కరప్షన్ ఉందని కానీ జగన్ పాలనలో ఈ అవినీతి తారాస్థాయికి చేరిందని.. ఏ పనిచేసిన మీ మద్దతుదారులకు డబ్బులు కట్టాలా.. నేనెలా బతకాలో చెప్పాడానికి నువ్ ఎవడివి జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ లాంటి క్రిమినల్ రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఎందుకు జరుగుతుందంటూ ఆయన విరుచుకుపడ్డారు. వాలంటీర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు కొందరు చేసిన తప్పులవల్లే నేను ఆ మాటలు అన్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.