Last Updated:

KGF 3 : గూస్ బంప్స్, పూనకాలు కూడా తక్కువేనా.. దిమ్మతిరిగేలా కేజీఎఫ్ 3 అప్డేట్

తెలుగు ప్రేక్షకులకు రాకింగ్ స్టార్ యష్ గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది కేజీఎఫ్ రెండవ భాగం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన

KGF 3 : గూస్ బంప్స్, పూనకాలు కూడా తక్కువేనా.. దిమ్మతిరిగేలా కేజీఎఫ్ 3 అప్డేట్

KGF 3 : తెలుగు ప్రేక్షకులకు రాకింగ్ స్టార్ యష్ గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది కేజీఎఫ్ రెండవ భాగం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్ సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కి సమానంగా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది కేజీఎఫ్ చాప్టర్ 2.

ర్యాంపేజ్ అనే పదానికి అసలైన అర్దం చెప్పేలా.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2023 కి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేజీఎఫ్ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ దీన్ని పోస్ట్ చేసింది. రాకీస్ మాన్‌స్టర్ కట్ పేరుతో విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నింటినీ కలిపి మిక్స్ చేశారు.

ముఖ్యంగా హోంబలే ఫిల్మ్స్‌ ట్వీట్ చేస్తూ..’మోస్ట్ పవర్‌ఫుల్ మ్యాన్‌ చేసిన పవర్‌ఫుల్‌ ప్రామిస్. కేజీఎఫ్‌-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్‌-3 పై హింట్‌ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్‌-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాఖీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ (KGF 3)..?

ముఖ్యంగా వీడియో చివర్లో ‘‘రాఖీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు?’’ అంటూ హీనత ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర మూడో భాగం రాఖీ భాయ్‌ కనిపించకుండా పోయిన ఆ నాలుగేళ్లలో ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అన్నది చూపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, హోంబలే ఫిలింస్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటాయి. ‘బాహుబలి 2’ తరవాత ప్రభాస్‌కు మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ పడలేదు. ఈ సినిమాతో కచ్చితంగా మళ్లీ రెబల్ స్టార్ బాక్సాఫీసును బ్రేక్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.