Last Updated:

NTRNeel Shooting: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌ షురూ, క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్‌

NTRNeel Shooting: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌ షురూ, క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్‌

NTRNeel Movie Shooting Began: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది పూజ కార్యక్రమంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఇక రెగ్యూలర్ షూటింగ్‌ ఎప్పుడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌నీల్‌ (NTRNeel) షూటింగ్‌ నేడు అధికారికంగా ప్రారంభమైందని ప్రకటిస్తూ సెట్‌లోని ఫోటో షేర్‌ చేశారు.

బాంబు పేలుడుకు సంబంధించి సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రశాంత్‌ నీల్‌ మైక్‌ పట్టుకుని సీన్‌కి సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్న సెట్‌లోని ఫోటో షేర్‌ చేశారు. చూస్తుంటే ఇది రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్‌ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోని షేర్‌ చేస్తూ “భారతీయ సినిమా చరిత్రలో రికార్డు సృష్టించేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్టీఆర్‌నీల్‌ షూటింగ్‌ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్‌ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది” అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. కాగా NTR31వగా తెరకెక్కునున్న ఈ సినిమా డ్రాగన్‌ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగనుంది. కేజీయఫ్‌, సలార్‌ తరహాలో డ్రాగన్‌ కూడా డార్క్‌ థీమ్‌లో తెరకెక్కనుంది. నేటి నుంచే మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మొత్తం ఎన్టీఆర్‌ లేకుండానే సాగనుందని, మార్చిలో ఉండే రెండోవ షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్‌ పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్‌ వార్‌ 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సప్త సాగరాలు ఫేం, కన్నడ హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు.