Last Updated:

Salaar: సలార్ @ రూ.550 కోట్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

Salaar: సలార్ @ రూ.550 కోట్లు

Salaar:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో సలార్ ప్రపంచ వ్యాప్తంగా రూ.550 కోట్ల కలెక్షన్లను అధిగమించిందని పోస్ట్ చేసారు.ప్రభాస్ ‘సాలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్ 50 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. 1వ రోజు – రూ176.52 కోట్లు, 2వ రోజు – రూ101.39 కోట్లు, 3వ రోజు – రూ95.24 కోట్లు, 4వ రోజు – రూ76.91 కోట్లు, 5వ రోజు – రూ40.17 కోట్లు, 6వ రోజు- రూ31.62 కోట్లు, 7వ రోజు – రూ20.78 కోట్లు, 8వ రోజు – రూ14.21 కోట్లు. మొత్తం – రూ556.84 కోట్లు అంటూ రాసారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు.ప్రభాస్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.

ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డు..(Salaar)

2023లో విడుదలయిన భారతీయ చిత్రాల ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డును సలార్ రూ.178.7 కోట్లతో నమోదు చేసిందని హోంబలే ఫిల్మ్స్ తెలిపింది.2023లో షారుఖ్ ఖాన్ నటించిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలైన పఠాన్ మరియు జవాన్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.106 కోట్లు, రూ.129.6 కోట్లు వసూలు చేసాయి. రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం మొదటి రోజు రూ.116 కోట్లు. వసూలు చేసింది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సలార్‌లో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్ మరియు జగపతి బాబు నటించారు.