Salaar : సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ ర్యాంపేజ్ కి గెట్ రెడీ !
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు.
Salaar : పాన్ ఇండియా స్టార్ “ప్రభాస్” హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’. ఈ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
టినూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రేయా రెడ్డి, మధు గురుస్వామి, పృథ్వీరాజ్, ఝాన్సీ, బ్రహ్మాజీ, జెమిని సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బ్రసూర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే రిలీజ్ దగ్గర పడుతున్న చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టడం లేదు.
మూవీ నుంచి కొత్త పోస్టర్స్ అండ్ టీజర్స్ ఏం రిలీజ్ చేయడం లేదు. (Salaar) ట్రైలర్ గురించిన అప్డేట్ కూడా రాకపోవడంతో.. ఈ సినిమా మళ్ళీ పోస్టుపోన్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలకు చెక్ పెడుతూ.. ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ ఉండబోతుంది అని అప్డేట్ ఇచ్చారు. సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 1న రిలీజ్ చేయడానికి నిర్మాతలు డేట్ ఫిక్స్ చేసుకున్నారట. చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లోని కొందరు నమ్మదగిన వ్యక్తులు ఈ వార్త నిజమే అని చెబుతున్నారు.
The wait is about to end!#Salaar Trailer Announcement is on the way 🔥#SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/NxM5qIoGSP
— Salaar (@SalaarTheSaga) November 9, 2023
ప్రభాస్ కూడా మొన్నటి వరకు యూరోప్ లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలి సర్జరీ కోసం వెళ్లిన ప్రభాస్.. రీసెంట్ గా ఇండియా తిరిగి వచ్చాడు. దీంతో సలార్ ప్రమోషన్స్ కూడా ఊపు అందుకున్నాయని సమాచారం. మరి ఈ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి.