E-Challan: డీజీపి వాహనానికి ఇ చలానా కట్టరా.. వైరల్ అయిన మెసేజ్
నేటి సమాజంలో సోషల్ మీడియా చాలా విస్తృతంగా మారింది. ఏమరపాటుగా ఉన్నా, చట్టానికి అతీతంగా వ్యవహరించినా వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది సామాన్యుడైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నేతలైనా సోషల్ మీడియా ముందు తలదించుకోవాల్సిందే.
Hyderabad: నేటి సమాజంలో సోషల్ మీడియా చాలా విస్తృతంగా మారింది. ఏమరపాటుగా ఉన్నా, చట్టానికి అతీతంగా వ్యవహరించినా వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది సామాన్యుడైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నేతలైనా సోషల్ మీడియా ముందు తలదించుకోవాల్సిందే. అలాంటి ఓ ఘటన ట్విట్టర్ లో వైరల్ మారి తెలంగాణ పోలీసు అధికారులను తల దించుకొనేలా చేసింది.
వివరాల్లోకి వెళ్లితే, తెలంగాణ డీజీపీ పేరుతో ఉన్న వాహనానికి రెండు సంవత్సరాల నుండి రూ. 7వేల రూపాయల ఫైన్ కట్టడం లేదంటూ ఓ మెసేజ్ ట్విట్టర్ లో వైరల్ అయింది. దీంతో వెంటనే పోలీసు శాఖ అప్రమత్తమైంది. వెంటనే వైరల్ అయిన వాహనం నెం. టీఎస్09పీఏ1234 కు పెండింగ్ ఉన్న ఇ చలానా మొత్తం రూ. 6945 లను సంబంధిత అధికారి చెల్లించేసారు.
దీనిపై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాధ్ వివరణ కూడా ఇచ్చారు. 2018 నుండి రాష్ట్రంలోని అన్ని పోలీసు వాహనాల రిజిష్ట్రేషన్ డీజీపీ పేరు మీదే ఉన్నాయన్నారు. వైరల్ అయిన వాహనం కు సంబంధిత పోలీసు అధికారి ఫైన్ చెల్లించేసారని పేర్కొన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు వాహనాలకు గల ఇ చలానా రూ. 28.85లక్షలు చెల్లించారని ఆయన తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అధికారులు కూడా ఏప్రిల్ వరకు రూ. 15లక్షల చలానా డబ్బులు చెల్లించిన్నట్లు ఆయన తెలిపారు.
సీపీ రంగనాధ్ పేర్కొన్న మేర ప్రభుత్వ యంత్రాంగం కూడా తప్పులు చేస్తున్నారని అర్ధం అవుతుంది. ఇకనైనా ఏ ప్రభుత్వ వాహనానికి ఇ చలానా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను అందరూ తెలుసుకోవాలి. లేకపోతే చట్టాన్ని సరిదిద్ధేవారే తప్పు చేస్తున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లుతుందని గమనించాలి. మొత్తం మీద సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ వార్తలు అడప, దడపా ప్రభుత్వ అధికారులకు కూడా బాధ్యతను గుర్తు చేస్తున్నాయని చెప్పాల్సిందే.
ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్