Elon Musk: ట్విటర్ యూజర్లకు షాక్.. రోజువారి పోస్టులపై పరిమితులు విధించిన మస్క్
Elon Musk: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో మరో సంచలన మార్పులు చేసి యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చారు మస్క్. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై కూడా తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు వెల్లడించారు.
Elon Musk: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో మరో సంచలన మార్పులు చేసి యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చారు మస్క్. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై కూడా తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ పరిమితులు ఒక్క అన్‌వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లకే అనుకుంటే పొరపాటే.. వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లకు కూడా ఈ పరిమితులు వర్తిస్తాయని పేర్కొన్నారు మస్క్. వెరిఫైడ్ అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు 6వేల పోస్టులు, అన్‌వెరిఫైడ్ యూజర్లకు రోజుకు 600 పోస్టులకు, ఇక కొత్త అకౌంట్లు తెరిచిన అన్‌వెరిఫైడ్ యూజర్లు రోజుకు 300 ట్వీట్లు మాత్రమే చదవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించి ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. కాగా విపరీతమైన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ ను తగ్గించడానికే తాము ఈ పరిమితులను విధించినట్లు ఆయన వివరించారు.
మస్క్ మరో ఆఫర్(Elon Musk)
ఇకపోతే ఈ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మస్క్ మరో ట్వీట్ చేశారు.. వీటిలో మరికొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. వెరిఫైడ్ అకౌంట్ ఉన్నవారు 8వేలు, అన్ వెరిఫై అకౌంట్ కలిగిన యూజర్లు 800 పోస్టులు, కొత్త అన్‌వెరిఫైడ్ యూజర్లు 400 పోస్టులు చదివేలా పెంచుతామని మస్క్ ఆ ట్వీట్‌లో తెలిపారు. వందలాది సంస్థలు ట్విటర్ డేటాను అత్యంత దూకుడుగా స్క్రాప్ చేస్తున్నాయని, ఇది యూజర్లను ప్రభావితం చేస్తుందని మస్క్ పేర్కొన్నారు.
Rate limits increasing soon to 8000 for verified, 800 for unverified & 400 for new unverified https://t.co/fuRcJLifTn
— Elon Musk (@elonmusk) July 1, 2023
శనివారం సాయంత్రం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ట్విటర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెబ్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేక పోయారు. కొంతమంది ట్వీట్ చేయగా రేట్ లిమిట్ ఎక్సీడెడ్ అని వచ్చింది. దీంతో మస్క్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో మస్క్ స్పందించారు. తాము సాధ్యమైనంత త్వరగా అప్‌డేట్ చేస్తామని చెప్పారు.