Last Updated:

Crime News: రెండు రాష్ట్రాల్లో రెండు దారుణాలు డీఎస్పీ, ఎస్సైలను ట్రక్కులతో గుద్ది చంపేసారు.

హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్‌ జిల్లా పచ్‌గావ్‌ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్‌ డీఎస్పీ సురేంద్ర సింగ్‌ బిష్ణోయ్‌

Crime News: రెండు రాష్ట్రాల్లో రెండు దారుణాలు డీఎస్పీ, ఎస్సైలను ట్రక్కులతో గుద్ది చంపేసారు.

Crime News: హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్‌ జిల్లా పచ్‌గావ్‌ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్‌ డీఎస్పీ సురేంద్ర సింగ్‌ బిష్ణోయ్‌ మంగళవారం తన బృందంతో కలిసి అక్రమ మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులను చూసిన అక్రమ మైనింగ్‌ కార్మికులు, నిర్వాహకులు పరారయ్యారు.

రాళ్లను తరలిస్తున్న ట్రక్కును ఆపేందుకు డీఎస్పీ ముందుకెళ్లగా, డ్రైవర్‌ ట్రక్కును డీఎస్పీపైకి ఎక్కించాడు. దీంతో డీఎస్పీ సురేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. డీఎస్పీ పక్కనే ఉన్న ఇద్దరు పోలీసులు (గన్‌మన్‌, డ్రైవర్‌) తృటిలో తప్పించుకున్నారు. నిందితుడు ఇక్కర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తప్పించుకునేందుకు ప్రయత్నించి పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం నల్హార్‌ వైద్య కళాశాలకు తరలించారు.

హరియాణా డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో మంగళవారం రాత్రి జరిగింది. రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్‌ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య టోప్నే రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి ఎస్సైని తొక్కించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద‍్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి వాహనాన్ని సీజ్‌ చేశామని సీనియర్‌ ఎస్పీ కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి: