Chikoti Praveen: తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.

Hyderabad: పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు. ఈనెల 4న వినతిపత్రం ఇచ్చినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని చికోటి ప్రవీణ్ తెలిపారు. కాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు చికోటి ప్రవీణ్ వినతిని పరిష్కరించాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది.