Last Updated:

Central Government: పోలవరం వల్ల భద్రాచలంకు ముప్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రం

పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది.

Central Government: పోలవరం వల్ల భద్రాచలంకు ముప్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రం

New Delhi: పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది. తొలుత ప్రారంభించిన పోలవరం నిర్మాణంలో అనంతరం జరిగిన మార్పుల ప్రభావంతో ముంపు ప్రాంతాల్లో మరో పర్యాయం అధ్యయనం చేయాలన్న తెలంగాణ వాదనను కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. పోలవరం వల్ల భద్రాచలంకు ముప్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ వైపే కేంద్రం మొగ్గు చూపింది.

ఏపీ సీఎస్ సమీర్ శర్మ ప్రాజక్ట్ నిర్మాణం పై పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను వివరించారు. ఆ సమయంలో పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వాదనలను ఏపీ అధికారులు తోసిపుచ్చారు. పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను మూడో ఏజెన్సీ ద్వార విచారణ జరిపించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. ముంపు సమస్యను మాత్రం మూడు రాష్ట్రాలు కేంద్ర జల శక్తికి తెలిపాయి. ప్రజాభిప్రాయాన్ని కూడా చేపట్టలేదని ఒడిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. పోలవరం ఎత్తు తగ్గించాలని పట్టుబడ్డాయి. ఒడిస్సాలో ముంపు లేకుండా ఉండేలా చూసేందుకు రక్షణ గోడ నిర్మాణానికి ఒడిస్సా ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ పేర్కొనింది. చాలా అంశాల పై అసంపూర్తిగా సమావేశం ముగియడంతో తిరిగి అక్టోబర్ 7న మరోసారి సమావేశం కావాలని కేంద్రం నిర్ణయం తీసుకొనింది.

ఇప్పటి వరకూ ముంపు సమస్య ఒడిసా నుంచే ఎదురువుతుండగా, తాజాగా తెలంగాణ నుంచి కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. పోలవరం నిర్మాణంతో భద్రాచలం మునిగిపోతుందని అంటోంది. జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయమంతంటినీ కేంద్రమే భరించాల్సి ఉంది. కాంక్రీట్‌ నిర్మాణ పనులతో సహా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయం బాధ్యతా కేంద్రానిదే. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్రాన్ని తప్పుబడుతూ వస్తోంది. భూసేకరణలో జాప్యం కారణంగా వ్యయాలు విపరీతంగా పెరిగాయని, సహాయ పునరావాస చెల్లింపుల బాధ్యత తనది కాదని. 2013 భూసేకరణ చట్టం మేరకు చెల్లింపులు జరపాలంటే కష్టమని అంటోంది. ఈ సమస్య వీడని చిక్కుముడిలా మారింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రి హరీష్ కు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి బొత్స

ఇవి కూడా చదవండి: