Home / Polavaram
ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు.
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల్లో, భూ సేకణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధుల కావాలనే కారణాలు చూపించినా అంగీకరించొద్దు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రూ. 250కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం కింద చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు అనే విషయం కామన్ అయిపోయాయి.
పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది.