Last Updated:

Andhra Pradesh: కారం పొడితో స్వామికి అభిషేకం.. ఎక్కడంటే..

పాలతో అభిషేకాల గురించి తెలుసు. రకరకాల పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేయడం చూశాం. కానీ ఏలూరు జిల్లాలో కారంతో అభిషేకం చేశారు భక్తులు, దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు.

Andhra Pradesh: కారం పొడితో స్వామికి అభిషేకం.. ఎక్కడంటే..

Eluru: పాలతో అభిషేకాల గురించి తెలుసు. రకరకాల పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేయడం చూశాం. కానీ ఏలూరు జిల్లాలో కారంతో అభిషేకం చేశారు భక్తులు, దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు.

దాదాపు 50 కిలోల కారంతో శివస్వామికి అభిషేకం నిర్వహించారు. ప్రత్యంగిరా అమ్మవారికి కారం అంటే ఎంతో ప్రీతిపాత్రమని అందుకే అమ్మవారిని ఆవాహన చేసుకున్న శివస్వామికి కారంతో అభిషేకాలు జరపడం సంప్రదాయమని నిర్వాహకులు తెలిపారు. హిరణ్య కశికుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించింది అని పండితులు చెబుతారు.

ప్రత్యంగిరి అమ్మవారికి కారం అంటే ఎంతో ఇష్టమని, అందుకే అమ్మవారిని ఆవాహన చేసుకున్న శివ స్వామికి కారంతో అభిషేకాలు నిర్వహస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి అంతా ఆశ్రమంలోనే జాగారం చేసిన భక్తులు తెల్లవారు జామును కార్తీక మాసం మూడో సోమవారం నాడు స్వామీజీకి కారం పొడితో అభిషేకాలు చేశారు.

 

 

ఇవి కూడా చదవండి: