Published On:

Thammudu Vs Khaidi: నితిన్ ‘తమ్ముడు’ కథ కాపీనా..? క్రిటిక్స్ కామెంట్స్

Thammudu Vs Khaidi: నితిన్ ‘తమ్ముడు’ కథ కాపీనా..? క్రిటిక్స్ కామెంట్స్

Thammudu Vs Khaidi: హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమా విడుదలైన తర్వాత కార్తీ ‘ఖైదీ’ గుర్తుకు వచ్చిందని విమర్శకులు కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే మరి కొంతమంది విమర్శకులు ‘ఎంసీఏ’ ఛాయలు కనిపించాయని అంటున్నారు. అసలు ఈ రెండు సినిమాల మధ్య కంపేరిజన్స్ ఎందుకు వచ్చింది. తమ్ముడు సినిమా స్టోరీ ఎంటో చూద్దాం..

 

అయితే తమ్ముడు సినిమాలో హీరో నితిన్, నటి లయ, నటుడు సౌరబ్ సచ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఝాన్సీ కిరణ్మయి (లయ) ప్రభుత్వ ఉద్యోగిగా పాత్ర పోషించింది. అయితే ఝాన్సీ కుటుంబంతో కలిసి అంబర్ గొడుగు అనే ఊరిలో జరుగుతున్న పగడాలమ్మ తల్లి జాతరకు వెళ్తుంది. విశాఖలో అజర్వాల్ (సౌరబ్ సచ్‌దేవ్)కు చెందిన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. దీంతో నిజనిర్ధారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నిజానికి అది ప్రమాదం కాదు.. కంపెనీ నష్టాల్లో ఉడడంతో అజర్వాల్ ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఇలా చేయిస్తాడు. అయితే నిజనిర్ధారణ కమిటీలో నిజాలు బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వ అధికారులను భయపెట్టి తనకు సానుకూలంగా రిపోర్ట్ తయారు చేయిస్తాడు. ఈ రిపోర్ట్‌పై ఝాన్సీ సంతకం చేయదని అధికారులు చేపడంతో.. అంబర్ గొడుకులో ఉన్న ఝాన్సీని ఆమె కుటుంబాన్ని చంపేయమని మనుషులను అజర్వాల్ పురామయిస్తాడు. దీంతో ఝాన్సీ కుటుంబానికి అండగా హీరో జై (నితిన్) ఉంటారు. ఇది స్టోరీ..

 

‘ఖైదీ’ కథకు వస్తే.. పోలీసులు ఒక పెద్ద డ్రగ్‌ రాకెట్‌ని చేధించి ఓ ఎస్పీ ఆఫీస్‌లో భద్రపరుస్తారు. అదే సమయంలో పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి రిటైర్ అవుతున్న సందర్భంగా అందరికి పార్టీ ఇస్తారు. పట్టుబడిన వారిలో ఉన్న సదరు డ్రగ్‌ మాఫియా కింగ్‌పిన్ ఈ పార్టీలో డ్రగ్స్ కలిపి అందరిపై ఎటాక్ చేయాలని చూస్తాడు. దీంతో స్పృహ తప్పిపడిపోయిన ఆఫీసర్లని భద్రంగా లారీలో ఆసుపత్రికి చేర్చే బాధ్యత జైల్లో 10 ఏళ్లు శిక్ష అనుభవించిన హీరో కార్తీకు అప్పగిస్తారు. దారిలో అడుగడుగునా ఎవరెవరో ఎటాక్ చేస్తునే ఉంటారు. చివరికి ఆఫీసర్లను కార్తీ కాపాడుతారు.

 

అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ థింగ్స్ ఏమిటంటే.. ఈ సినిమాల్లో సెంటిమెంట్స్ పక్కన పెడితే.. వెహికల్స్ కీ రోల్ ప్లే చేశాయి. అటు పోలీసులు ఉన్న లారీని కార్తీ నడపగా.. ఇటు ఓ బస్సులో అక్క ఫ్యామిలీని తీసుకుని నితిన్ వెళ్తాడు.. ఎమోషన్స్ వేరైనా యాక్షన్‌తో ట్రావెల్‌ అయ్యేలా ఈ రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో రెండు సినిమాల మధ్య కంపేరిజన్స్ చేస్తూ క్రిటిక్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ దర్శకుడు శ్రీరామ్ వేణు తీసిన ‘ఎంసీఏ’ సినిమా ప్రస్తావన ఎందుకు వస్తుందనుకుంటున్నారా.. ఎంసీఏ మూవీలో భూమిక ప్రభుత్వ అధికారి.. తమ్ముడు సినిమాలో కూడా సేమ్ అలాగే లయ కూడా ప్రభుత్వ అధికారి.. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లో హీరో, విలన్‌ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. తమ్ముడులో అక్క కోసం హీరో రంగంలోకి దిగితే.. ఎంసీఏలో మాత్రం వదిన కోసం హీరో రంగంలోకి దిగుతాడు. ఇది సంగతి.. అందుకే క్రిటిక్స్ కామెంట్ల వర్షం కురిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: