Published On:

Ukrainian President Volodymyr Zelensky: రష్యాతో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Ukrainian President Volodymyr Zelensky: రష్యాతో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Ukrainian President Volodymyr Zelensky ready to discus with Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో చర్చలకు పుతిన్ ఆహ్వానాన్ని ప్రస్తావించలేదన్నారు. రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. చాలారోజుల నుంచి ఇందుకోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పారు. యుద్ధం ముగింపులో తొలి అడుగు కాల్పుల విరమణ అని పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

 

సోమవారం నుంచి మొదలయ్యే 30 రోజుల కాల్పుల విరమణకు రష్యా నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వెల్లడించారు. దీనికి పలువురు ఐరోపా నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. మరోవైపు కీవ్‌తో ప్రత్యేక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా ప్రకటించారు. చర్చల ద్వారా పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులు ఆపేశామని తెలిపారు. ఈస్టర్ కాల్పుల విరమణ, ‘విక్టరీ డే’ కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి: