Last Updated:

Russian soldiers Rapes: ఉక్రెయిన్‌ లో రష్యా సైనికుల అత్యాచారాలు..

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఆగడాలకు అంతే లేకుండాపోతోంది. రష్యా సైనికులు పెద్దెత్తున యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలుఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి

Russian soldiers Rapes: ఉక్రెయిన్‌ లో రష్యా సైనికుల అత్యాచారాలు..

Russian soldiers Rapes: రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఆగడాలకు అంతే లేకుండాపోతోంది. రష్యా సైనికులు పెద్దెత్తున యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలుఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయానికి సుమారు 71 వేల ఫిర్యాదులు అందాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిసిపోతోంది.

గత ఏడాది మార్చిలో రాజధాని కీవ్‌ సమీపంలోని బ్రోవరి జిల్లాలో మోటరైజ్డ్‌ రైఫిల్‌ బ్రిగేడ్‌ దారుణమైన అత్యాచారాలకు పాల్పడింది. ఇద్దరు రష్యన్‌ సైనికులు ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడగా, బాలిక తల్లికి తుపాకి గురి చూపించి బాలిక తల్లిని ఆమె తండ్రి ముందే గ్యాంగ్‌ రేప్‌ చేశారు. గత ఏడాది కాలంగా ఉక్రెయిన్‌ల రష్యా సైనికుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఉక్రెయిన్‌ ప్రాసిక్యూషన్‌ వద్ద ఈ కేసు ఫైల్‌ అయ్యింది. రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రతినిధి దీనిపై స్పందించమనిరష్యా రక్షణమంత్రిత్వశాఖను కోరగా.. స్పందించడానికి నిరాకరించింది. కాగా రష్యా బ్రిగేడియర్ల ఫోన్‌ నంబర్లు పనిచేయడం లేదు. అయితే సమారా గారిసన్‌కు చెందిన ఇద్దరు అధికారులను వారి ఉన్నతాధికారుల కాంటాక్టు నంబర్లు ఇవ్వాలని రాయిటర్స్‌ విలేకరులు కోరగా తాము ఫోన్‌ నెంబర్లు ఇవ్వలేమని నిబంధనల ప్రకారం ఇవ్వడానికి కుదరదని స్పష్టం చేశారు.

కమాండర్ల మద్దతుతోనే అత్యాచారాలు..(Russian soldiers Rapes)

గత ఏడాది ఫిబ్రవరి 24న రష్యా కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలం కావడంతో.. సైనికులు కొన్ని రోజుల తర్వాత కీవ్‌కు సమీపాన ఉన్న బ్రోవరి పట్టణంలోకి ప్రవేశించారు. వెంటనే నగరంలో లూటీలకు, అత్యాచారాలకు పాల్పడ్డారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా స్థానిక పౌరులను బెదిరించడానికి చేసిన పనిగా ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. మహిళలను ఒక వైపు నిలబెట్టారని సాక్ష్యులను విచారించినప్పడు చెప్పారని ప్రాసిక్యూటర్స్‌ వెల్లడించారు. గత ఏడాది మార్చి 13వ తేదీన రష్యా సైనికుల మద్యం మత్తులో దారుణాలకు పాల్పాడ్డారు. ఓ యువ జంట ఉన్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. భర్త ముందే భార్యను గ్యాంగ్‌ రేప్‌ చేశారు. కాగా రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం తాము పాశ్చాత్యదేశాల మద్దతు ఇస్తున్న నియో నాజీపై యుద్ధం చేస్తున్నామని.. రష్యా సైనికులపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. రష్యా సైనికులు పాల్పడుతున్న అత్యాచారం కేసులు మిలటరీ కమాండర్లకు తెలుసు అయినా వారు కూడా తమకు ఏమీ తెలియదన్నట్లు అమాయకత్వ నటిస్తున్నారు.బ్రోవరి పట్టణంలో మరో సంఘటనలో ఇద్దరు సైనికులు ఒక ఇంట్లో బలవంతంగా ప్రవేశించి 41 ఏళ్ల గర్భిణితో పాటు17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఇదే పట్టణంలో పలు కుటుంబాలు నివసించే ప్రాంతానికి వెళ్లిన సైనికులు అందరిని వంటింట్లో బంధించి ఓ 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచారానికి గురైన వీరంతా మానసికకంగా చితికిపోయారు. వీరికి ప్రభుత్వం చికిత్స అందిస్తోంది.

ఇప్పటివరకు 71 వేల ఫిర్యాదులు..

ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం సుమారు 71వేల కేసులపై విచారణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ అధికారులు అత్యాచారాలకు పాల్పడిన అనుమానితులను పట్టుకొని శిక్షలు విధించాలి. అయితే వీరిని కోర్టుకు తీసుకురావడం అయ్యే పనికాదు. కాగా వీరు విచారణకు కూడా రారు. అలాంటి సమయంలో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టుల సాయం తీసుకునే అవకాశం ఉంటుంది. నేరాలు చేసిన అనుమానితులు మాస్కోకు కూడా లొంగిపోయే అవకాశాలుండవు. అయితే విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న సైనికులపై అంతర్జాతీయ వాచ్‌లిస్టులో పెడతారు. అలాంటి వారు ఇతర దేశాలకు వెళ్లడానికి వీలుపడదు. ఇదిలా ఉండగా రష్యా కూడా ఉక్రెయిన్‌ సైనికుల తమ సైనికుల పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రతి విమర్శలు గుప్పిస్తోంది. రష్యాకు చెందన పది మంది ఖైదీలను ఊరి వేసిందని రష్యా తాజాగా ఆరోపిస్తోంది.

ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలన గమనిస్తోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న డజన్ల కొద్ది అత్యాచారాలు చేస్తోంది రష్యా సైనికులే అని తేల్చి చెప్పింది. కాగా ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్లు ఇప్పటి వరకు 26 మంది రష్యా సైనికులకు శిక్షలు విధించింది. కొంత మంది తిరిగి మాస్కోకు వెళ్లిపోయారు. వీరికి శిక్షలు విధించడానికి ఉక్రెయిన్‌ అంతర్జాతీయ క్రమినల్‌ కోర్టులను ఆశ్రయించింది. మరి వీరికి భవిష్యత్తులో శిక్షలు పడతాయా లేదా అనేది కాలమే చెప్పాలి.