Last Updated:

PM Modi US Visit: బైడెన్-మోడీ కలయిక.. మోడీ మెనూ ఏంటి.. ఒకరికొకరు ఏం గిఫ్ట్స్ ఇచ్చుకున్నారో తెలుసా

PM Modi US Visit: ఒకరేమో ప్రపంచాన్నే శాశించగల అగ్రరాజ్యాధినేత, ఇంకొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ప్రధాని మరి వీరిద్దరి కలకయిక జరుగుతుందంటే ప్రపంచ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాయా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.

PM Modi US Visit: బైడెన్-మోడీ కలయిక.. మోడీ మెనూ ఏంటి.. ఒకరికొకరు ఏం గిఫ్ట్స్ ఇచ్చుకున్నారో తెలుసా

PM Modi US Visit: ఒకరేమో ప్రపంచాన్నే శాశించగల అగ్రరాజ్యాధినేత, ఇంకొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ప్రధాని మరి వీరిద్దరి కలకయిక జరుగుతుందంటే ప్రపంచ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాయా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఒకరు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అయితే మరొకరు భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ ఇద్దరూ కలిస్తే ఎలాగుంటుంది.. అసలేం చర్చించుకుంటారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ ఏర్పడింది. కాగా తాజా వాషింగ్టన్ లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి బైడెన్ దంపతుల చేత గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. దీనితోపాటు వైట్‌హౌస్‌ దగ్గర కూడా ఘన స్వాగతం లభించింది. మోదీకి ఎదురెళ్లి మరి బైడెన్‌ దంపతులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కాగా ఈ మధ్యాహ్నం అమెరికా ఉభయసభల్లో మోడీ, బైడన్ స్పీచ్‌ ఇవ్వనున్నారు. ఈ రాత్రికి బైడెన్‌ దంపతులు మోడీకి డిన్నర్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే. రేపు మోదీకి వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ ఆతిథ్యం కూడా ఇవ్వనున్నారు.

ప్రధాని మోడీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు బైడెన్ దంపతులు. ఈ మేరకు ప్రధాని మోడీ విందులోని మెనూ ఏమై ఉంటుందాని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోడీ శాకాహారి కావడంతో అందుకు తగ్గట్లుగా వంటలు ప్రిపేర్ చేయిస్తున్నారు జిల్ బైడెన్. వైట్ హౌజ్ చెఫ్ నినా కర్టిస్‌కు వెజిటేరియన్ ఫుడ్ లో మంచి ప్రావీణ్యం ఉంది కాబట్టి మోదీ మెనూను ఎంతో రుచికరంగా ఉండనున్నట్టు సమాచారం.

అయితే ఈ విందుకు ముందు జిల్ బైడెన్ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను మీడియాకు వివరించారు. జాతీయ పక్షి నెమలి నుంచి ప్రేరణ పొందిన థీమ్ నుంచి త్రివర్ణ పతాకాన్ని సూచించేలా డైనింగ్ ప్రాంతాన్ని డెకరేట్ చేశారు. భారతీయ రుచులతో ఈ వంటకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. మోనూలో ముఖ్యంగా మిల్లెట్స్ తో కూడిన వంటకాలు జోడించారు.

మోడీ మెనూ ఇదే..

ఫస్ట్ కోర్స్: మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మిలాన్, టాంగీ అవోకాడో సాస్.

మెయిన్ కోర్స్: స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్, క్రీమీ సఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్-డిల్ యోగర్ట్ సాస్, మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్వాషెస్

అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ఈ ఏడాదిని జరుపుకోవడానికి భారత్ నాయకత్వం వహిస్తున్నందుకు, ఈ మెనూలో మెరినేట్ చేసిన మిల్లెట్స్ చేర్చామని చెఫ్ నినా కర్టిస్ తెలిపారు

Image

బైడెన్ దంపతులకు మోడీ గిఫ్ట్స్(PM Modi US Visit)

ఇకపోతే మోదీని సాదరంగా వైట్‌హౌస్‌ కు ఆహ్వానించిన బైడెన్ దంపతులకు మోదీ భారత్ తరఫున కానుకలు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎర్ర చందనంతో తయారుచేసిన పెట్టలో వెండి వినాయకుడి విగ్రహం, దీపం కుందెను బహుకరించారు. అలాగే, జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని మోదీ గిఫ్ట్ గా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక అలాగే మోదీకి కూడా బైడెన్ దంపతులు పురాతన అమెరికన్ కెమెరాతో పాటు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ బుక్‌ను అందజేశారు.