Last Updated:

Pakistan Debt crisis: పాకిస్థాన్ రుణ సంక్షోభం.. మే 30 నాటికి 3.7 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాలి..

:ప్రస్తుతం పాకిస్తాన్‌ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్‌ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది

Pakistan Debt crisis: పాకిస్థాన్ రుణ సంక్షోభం.. మే 30 నాటికి 3.7 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాలి..

 Pakistan Debt crisis:ప్రస్తుతం పాకిస్తాన్‌ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్‌ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. అయితే పాక్‌ ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగైనా డిఫాల్ట్‌ నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తొంది. మిత్ర దేశాలతో పాటు .. విదేశీ బ్యాంకుల నుంచి రుణాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా పాకిస్తాన్‌కు పెద్ద మొత్తంలో డాలర్లు కావాల్సి వస్తోంది. బ్లూమ్‌బర్గ్‌కు ఫిచ్‌ ప్రాంతీయ రేటింగ్‌ అధికారి ఇంటర్వ్యూ ఇస్తూ.. జూన్‌ 2023 నాటికి పాకిస్తాన్‌ విదేశీ బ్యాంకులకు 3.7 బిలియన్‌ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే ఫిచ్‌ అధికారుల అంచనా ప్రకారం చైనా ఇచ్చిన 2.4 బిలియన్‌ డాలర్లు వచ్చే నెల మెచురిటి అవుతుందని.. దాన్ని రోల్‌ ఓవర్‌ అంటే మరికొన్ని నెలల పాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

ముఖం చాటేసిన ఐఎంఎఫ్..( Pakistan Debt crisis)

బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ నెలలో పాకిస్తాన్‌ సుమారు 700 మిలియన్‌ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. వచ్చే నెల చివరి నాటికి 3 బిలయన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కాగా పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా, యూఏఈ, ఆర్థికంగా ఆదుకున్నా ఐఎంఎఫ్‌ మాత్రం సంతృప్తికరంగా లేదు. ఐఎంఎఫ్‌తో 1.1 బిలియన్‌ డాలర్ల స్టాఫ్‌ లెవెల్‌ అగ్రిమెంట్‌ ఇంకా పూర్తి కాలేదు. అయితే ప్రధానమంత్రి నుంచి ఆర్థికమంత్రి వరకు అందరూ ఐఎంఎఫ్‌ 9వ సమీక్షలో పాక్‌పై విధించే అన్నీ షరతులను అమలు చేస్తామని హామీ ఇచ్చినా, ఐఎంఎఫ్‌ మాత్రం పాకిస్తాన్‌కు రుణాలు ఇవ్వడానికి ముఖం చాటేస్తోంది.

మాజీ ఆర్థికమంత్రి మిఫత్‌ ఇస్మాయిలీ ఇటీవల ఒక ప్రయివేట్‌ చాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐఎంఎఫ్‌ విధించిన అన్ని షరతులను పాకిస్తాన్‌ ఆమోదించినందున వెంటనే రుణం విడుదల చేయాలని కోరుతున్నారు. ఐఎంఎఫ్‌ రుణం విడుదల చేయడంలో జాప్యం చేస్తే పాకిస్తాన్‌ ఆర్థికంగా చితికిపోతుందన్నారు మాజీ ఆర్థికమంత్రి. అయితే ఫిచ్‌ రేటింగ్‌ మాత్రం పాకిస్తాన్‌ ,ఐఎంఎఫ్‌ రెండు ఒక ఒప్పందానికి రావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాతో పాటు యూఏఈలు పాకిస్తాన్‌కు ఆర్థికంగా సాయం అందించాయి. ఇండిపెండెంట్‌ ఎకనమిస్టులు,విశ్లేషకుల అంచనా ప్రకారం ఒక వేళ పాకిస్తాన్‌ డిఫాల్ట్‌ అయినా.. రుణ పునర్నిర్మాణం జరిగినా.. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుదని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ ముందు ఉంది ఒక్కటే ఆప్షన్‌ డిఫాల్ట్‌ నుంచి తప్పించుకోవాలంటే చైనా నుంచి కొంత మొత్తం రుణం తీసుకుని బకాయిలు చెల్లించి డిఫాల్ట్‌ గండం నుంచి తప్పించుకోవచ్చనని సూచిస్తున్నారు.

చైనా రుణంపై ఆశలు..

ఇదిలా ఉండగా చైనా ఆర్థికమంత్రి శుక్రవారం నాడు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. కీలకమైన అంశాల గురించి చర్చించారు. ముఖ్యంగా కొత్తగా రుణం ఇచ్చే అంశంతో పాటు మేచురిటీ అయ్యే రుణాన్ని మరోమారు పొడిగించే అంశం గురించి చర్చించారు. కాగా ఇటీవలే పాకిస్తాన్‌కు చెందిన ఉన్నతాస్థాయి అధికారుల బృందం చైనాను సందర్శించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కాగా చైనా విదేశాంగ మంత్రి త్వరలోనే కొత్త రుణం ఇచ్చే విషయం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇస్లామబాద్‌కు బీజింగ్‌ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ చైనాకే అనుకూలంగా ఉంది. అయితే పాకిస్తాన్‌ చైనాకు పెద్ద ఎత్తున ఎగుమతులు పెంచుకుని బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ను సమం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడి మార్కెట్‌ నిపుణుల అంచనా ప్రకారం చైనాకు చెందిన పవర్‌ కంపెనీలు మాత్రం పాకిస్తాన్‌తో వ్యాపారం చేయడం పట్ల పెద్ద ఉత్సాహం చూపడం లేదు. ఎందుకంటే చేసిన పనులకు చెల్లింపులు చేయడంలో తీవ్రమైన జాప్యం చేస్తున్నారని చైనా పవర్‌ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చైనా పవర్‌ కంపెనీలకు పాకిస్తాన్‌ బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో పాటు కంపెనీ లాభాలను కానీ డివిడెండ్‌లను కాఈన పాకిస్తాన్‌ చైనాకు ఇవ్వడం లేదు. దీనికి కారణం పాకిస్తాన్‌ వద్ద విదేశీ మారకద్రవ్యం పూర్తిగా అడుగంటి పోవడమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.వచ్చే నెల 30వ తేదీ నాటికి పాకిస్తాన్‌ 3.7 బిలయన్‌ డాలర్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా ఆదుకుంటుందా లేదా అనేది త్వరలోనే తేలిపోతుంది.